వదిననే చంపిన మంత్రెవరో ? విజయసాయి ఆరోపణలపై చర్చ

First Published Mar 29, 2018, 12:33 PM IST
Highlights
కొద్దిరోజుల క్రితం ఎంపి మాట్లాడుతూ ముగ్గురు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

టిడిపి మంత్రులపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఎంపి మాట్లాడుతూ ముగ్గురు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక మంత్రి భర్త వందలాది మందిని చంపించినట్లు చెప్పారు. మరో మంత్రేమో బెంగుళూరులో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ఇక, మూడో మంత్రి గురించి మాట్లాడుతూ, సొంత వదిననే చంపేసి రాజకీయంగా లబ్దిపొందినట్లు తీవ్రమైన ఆరోపణలే చేశారు.

ఎప్పుడైతే విజయసాయి మంత్రులపై ఆరోపణలు చేశారో అప్పటి నుండి టిడిపిలో బాగా కాక మొదలైంది. మంత్రులు మొదలు ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు కూడా విజయసాయిపై మండిపడుతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ఇద్దరు మంత్రులు మీడియా ముందుకొచ్చి తమ వాదనలు వినిపించారు.

మొదటగా పరిటాల సునీత మాట్లాడుతూ, తన భర్త పరిటాల రవీంద్ర ఎవరినీ చంపించలేదన్నారు. తన భర్త గురించి అనంతపురం జిల్లాలోనే కాదని రాష్ట్రం మొత్తం మీద ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అంటూనే విజయసాయిపై మండిపడ్డారనుకోండి అది వేరే సంగతి.

తర్వాత మరో మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా మీడియా ముందుకొచ్చారు. ఆది మాట్లాడుతూ, తనకు బెంగుళూరులో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవన్నారు. తాను స్వచ్చంద సంస్దను నడుపుతున్నట్లు చెప్పారు. సరే, ఈయన కూడా ఎంపిపై తీవ్రంగా ఎదురుదాడి చేశారు లేండి. మంత్రులిద్దరూ మీడియా ముందుకు రావటంతో కొంత వరకూ క్లారిటీ వచ్చింది.

మరి, మిగిలింది మూడో మంత్రి. సొంత వదిననే చంపేసి రాజకీయంగా లబ్దిపొందిన మంత్రెవరు? అన్న విషయంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రతీ ఒక్కరికీ అనుమానాలైతే ఉన్నాయి కానీ ఆధారాలు లేవు కాబట్టి బాహాటంగా ఎవరూ మాట్లాడటం లేదు. మరి, వైసిపి ఎంపి చెప్పిన ఆ  మూడో మంత్రెవరూ తనంతట తానే మీడియా ముందుకు వచ్చి మిగిలిన ఇద్దరు మంత్రుల లాగ ఎప్పుడు వివరణ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ మూడో మంత్రెవరబ్బా?

 

 

 

click me!