చంద్రబాబు అవినీతిపై విచారణ జరుగుతుందా ? గవర్నర్ కు ఫిర్యాదు

First Published Mar 29, 2018, 11:44 AM IST
Highlights
మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు

చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతిని బిజెపి వదిలిపెట్టేలా లేదు. హటాత్తుగా విచారణ జరిపించటానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బిజెపి ఎంఎల్సీ మాధవ్ గురువారం చేసిన తాజా ఆరోపణల తీవ్రత చూస్తే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి.

మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. పట్టిసీమ, పోలవరం లాంటి ప్రాజెక్టులు టిడిపి నేతలకు కల్పతరువుగా మారిపోయిందని మండిపడ్డారు. వివిధ పథకాలకు కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ పక్కదారి పట్టినట్లు ధ్వజమెత్తారు.

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్ధాయిలో అమిత్ షా ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపితే చంద్రబాబు కూడా లేఖ రూపంలో సమాధానం ఇవ్వాల్సిందిపోయ అసెంబ్లీలో మాట్లాడటమేంటని నిలదీశారు. అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో అందరికీ తెలిసిందే అన్నారు. ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒంటరిగా పోటీచేసి గెలిచిన చరిత్ర ఎప్పుడైనా చంద్రబాబుకుందా అంటూ నిలదీశారు.

 

 

 

 

 

click me!