
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు. రోజా అంటేనే ఓ దరిద్రమని ఆయన ఎద్దేవా చేశారు. ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వ నాశనమేనని ఆయన విమర్శించారు. శనివారం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ రోజాపై ధ్వజమెత్తారు.
రోజా మాట్లాడే మాటలకు మహిళలే తలదించుకుంటున్నారని ఆరోపించారు. జబర్దస్త్‌లో డాన్సులు చేసే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ఎద్దేవా చేశారు. రోజా కారణంగా జగన్ తన పార్టీ జెండా పీకేసి డ్రామా ట్రూప్ పెట్టడం ఖయమన్నారు. నంద్యాల, కాకినాడ గెలుపుతో వైసీపీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. 2019 ఎన్నికల లోపు టీడీపీ మరింత బలోపెతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి.