
ఇంతకీ ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారబ్బా? అదే ఎవరికీ అర్ధం కావటం లేదు. పవన్ కొత్త సినిమా టీజర్ చూసిన వారికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే, టీజర్ సన్నివేశంలో పవన్ ఒకవైపు నిలబడుంటే పక్కనే కుర్చీ గింగిరాలు తిరుగుతూంటుంది. అంటే, ఏమటర్ధం? ఆ సన్నివేశానికి, పవన్ క్రియాశీలక రాజకీయాలకు ఏమన్నా సంబంధాలున్నాయా? అన్నదే నెటిజన్ల సందేహాలు.
ఎందుకంటే, 2014లో టిడిపి, భాజపా కూటమి అధికారంలోకి రావటానికి పవన్ మద్దతు కూడా బాగా సహాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి పవన్ అంటే మిగిలిన రాజకీయ పార్టీలకు ‘ఏదో’ చెప్పలేని ‘ఇది’ మొదలైంది. అందుకే 2019 ఎన్నికల్లో పవన్ మద్దతు కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇటువంటి నేపధ్యంలోనే పవన్ కొత్త సినిమా టీజర్ రిలీజైంది. మొత్తం మీద పవన్ బలం ఇతా అని ఎవరికీ తెలీదు. కాబట్టే పవన్ రాజకీయాల్లో క్రియాశీలమైతే ఏదో చేసేస్తాడు అన్న ప్రచారమైతే జరుగుతున్న విషయం తెలిసిందే కదా? ఈ నేపధ్యంలోనే కొత్త సినిమా టీజర్ రిలీజైంది. అందులోని సన్నివేశం దేనికి సూచికో ఎవరికీ అర్ధం కావటం లేదు. ‘పవన్ అనుకుంటే కుర్చీని షేక్ చేసేస్తాడు’ అని అర్ధం వచ్చేట్లుగా సన్నివేశముడటంతో అందరిలోనూ ఆశక్తి పెరుగుతోంది.