
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం మండిపడుతోంది. మిగిలిన ప్రతిపక్షాలూ తీవ్రంగా స్పందించాయి. తెలంగాణాలోని కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించేసింది. అదేనండి ఫిరాయింపు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయడు మంత్రి పదవులు కట్టబెట్టటంపై. మిత్రపక్షం భాజపానేమో ఎటూ చెప్పలేకుండా తటస్తంగా ఉండిపోయింది. అంటే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేసింది తప్పని అందరూ తీర్మానించేసినట్లే. గడచిన మూడు రోజులుగా మంత్రివర్గంలోకి వైసీపీ ఎంఎల్ఏలను తీసుకోవటంపై పెద్ద దుమారమే రేగుతోంది. మరి, ప్రశ్నింటానికే పుట్టిన పవన్ కల్యాణ జనసేన పార్టీ మాత్రం ఎక్కడా అడ్రస్ లేదు.
చంద్రబాబు చేసింది తప్పని ప్రతిపక్షాలన్నీ ఎందుకంటున్నాయంటే తెలంగాణాలో తమ పార్టీ విషయంలో కెసిఆర్ చేసిన పనిని చంద్రబాబు తూర్పారబట్టారు కాబట్టి. టిడిపి ఎంఎల్ఏలను కెసిఆర్ లాక్కున్నారు. పైగా తలసానికి మంత్రిపదవిని కూడా కట్టబెట్టారు. దాంతో చంద్రబాబు ఇటు కెసిఆర్ తో పాటు అటు గవర్నర్ పైన కూడా తీవ్రస్ధాయిలో మండివడ్డారు. అప్పడు కెసిఆర్ చేసిన పనిని తప్పుపట్టిన చంద్రబాబు ఇపుడు అదే పనిని తాను చేసారు. కాబట్టి రాజకీయంగా అంత దుమారం మొదలైంది. మరి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ పవన్ దృష్టిలో లేదా? లేక చంద్రబాబును ప్రశ్నించేంత దమ్ము పవన్ లో లేదా? చంద్రబాబు చేసింది తప్పని అయినా చెప్పాలి. లేకపోతే చంద్రబాబు చర్యకు మద్దతైనా ప్రకటించాలి కదా? తప్పో, ఒప్పో ఏదో ఒకటి చెప్పాల్సిన పవన్ మాత్రం తనకేమి పట్టనట్లు ఉండటం పలువురిని ఆశ్చర్య పరుస్తోంది.
కారణాలేదైతేనేమి చంద్రబాబు చేసిన పనిమీద మాట్లాడనది ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే. జనసేన తరపున కల్యాణ్ స్పందించటం గమనార్హం. రెండు మూడు రోజుల్లో పవన్ స్పందిస్తారంటూ కల్యాణ్ చెప్పటం గమనార్హం.మాన్య జనాలు కూడా చంద్రబాబుది తప్పనే అంటున్నారు. మరి పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. రైతుల సమస్య కావచ్చు. తుందుర్రు సమస్యలోను అంతే. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల విషయంలోనూ అదే వైఖరి. అందుకే పవన్, చంద్రబాబు ఒకటే అని జనాలు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారంటే అది వారి తప్పెలా అవుతుంది.