కొత్త పార్టీకి రేపే ముహూర్తం పెట్టాడు

Published : Apr 02, 2017, 02:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
కొత్త పార్టీకి రేపే ముహూర్తం పెట్టాడు

సారాంశం

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనకు చంద్రబాబు అన్యాయం చేశారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.      

రౌడీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

 

మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడం ఆయనను నిరాశకు గురిచేసింది. దీంతో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలోనే ఆయన సంచలన ప్రకటన చేశారు.

 

తానే కొత్తగా ఓ పార్టీ పెడుతానని మీడియా ముందు ప్రకటించేశారు. రేపు ఉదయం పార్టీ వివరాలు ప్రకటిస్తానని తెలిపారు.

 

కాగా, మధ్యాహ్నంలోపే టీడీపీలో తన పదవులన్నింటికీ ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అసెంబ్లీ కార్యదర్శికి అలాగే చంద్రబాబు కూడా తన రాజీనామా పత్రాన్ని పంపించారు.

 

ప్రభుత్వ విప్‌ పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానని ఆ తర్వాత ఆయన మీడియాకు వివరించారు.



పార్టీ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదనే ఆవేదనతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

అయితే చింతమనేనిని బుజ్జగించే ప్రయత్నాలను బాబు వర్గం ఇప్పటికే మొదలుపెట్టంది.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు