ఏపీ రాజకీయాల్లో కలకలం.. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు

By telugu teamFirst Published Jan 16, 2020, 2:56 PM IST
Highlights

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని... ఆయన పార్టీ బాధ్యతలు తీసుకోవాలని ఓ వర్గం వారు కోరుకుంటున్నారు. దీనిపై చాలా సార్లు చర్చలు కూడా జరిగాయి. తాజాగా... కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

ఇప్పటికే ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పార్టీ నేత మరో పార్టీలోకి జంపింగ్ లు, జనసేన- బీజేపీ  కూటమిగా ఏర్పడటం.. రాజధాని గొడవల మధ్య ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రాజకీయాల్లోని జూనియర్ ఎన్టీఆర్ లాగేస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పరిస్థితి సరిగా లేదు.

తెలంగాణలో అయితే పూర్తిగా టీడీపీ ప్రాబల్యం కోల్పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమితో బాగానే దెబ్బపడింది. చాలా మంది కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో.. పార్టీ మరింత బలహీనంగా మారుతోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని... ఆయన పార్టీ బాధ్యతలు తీసుకోవాలని ఓ వర్గం వారు కోరుకుంటున్నారు. దీనిపై చాలా సార్లు చర్చలు కూడా జరిగాయి. తాజాగా... కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Also Read అతనో చెంగువీరా...: పవన్‌పై సీపీఐ రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు...

ఇంతకీ మ్యాటరేంటంటే... ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంక్రాంతి సందర్భంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతేకాదు ఆమె మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం బలరాంకు అనుచరురాలిగా ఉన్నారు. ఆమె చేసిన సేవలకుగాను అభిమానులు, కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. ఇందులో మరి కొంత మంది ముఖ్యమైన పార్టీ నేతల ఫోటోలను కూడా ముద్రించారు.

అంతే కాక వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా పెట్టారు.  ఫోటో కింద రాబోయే కాలానికి కాబోయే సీఎం, 2024 ముఖ్యమంత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇదంతా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చేసారన్నప్పటికీ ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. ఇంకేముంది ఈ విషయం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ నిజంగానే సీఎం అవుతాడా అన్న ఆలోచనలో అందరినీ పడేసింది.
 

click me!