టీడీపీకి 120 సీట్లు ఖాయం: చంద్రబాబు ధీమా

By Nagaraju penumalaFirst Published Apr 18, 2019, 5:05 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 120కి పైగా సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్నాకే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 120కి పైగా సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. 

ఎన్నికల ఫలితాలపై అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్నాకే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఇకపోతే  గురువారం ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఇకపోతే 175 మంది అసెంబ్లీ అభ్యర్ధులు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీలేరులో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరును టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 

ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుపై తాను జాతీయ స్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు. 

అలాగే ఫామ్ 17 గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఈనెల 23 నుంచి ఎన్నికల ప్రచారాని వెళ్తున్నానని అందువల్ల ఈనెల 22 న అభ్యర్థులంతా సమావేశానికి హాజరుకావాలని సూచించారు.   
 
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు తమ పార్టీ 130 సీట్లు గెలుస్తోందని స్పష్టం చేశారు. వారం రోజుల అనంతరం ఆయన 120పైగా సీట్లు అంటూ  చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

click me!