అమ్మాయిలపై అనర్థాలు సెల్ ఫోన్ల వల్లే: నన్నపనేని సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Apr 18, 2019, 4:27 PM IST
Highlights

సెల్ ఫోన్ల వాడకం అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు మోసపోవద్దంటూ హితవు పలికారు. విశాఖపట్నంలో పర్యటించిన నన్నపనేని రాజకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

విశాఖపట్నం: అన్ని అనర్థాలకు సెల్ ఫోన్ కారణమని ఆరోపించారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. సెల్ ఫోన్ల వాడకం అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు మోసపోవద్దంటూ హితవు పలికారు. 

విశాఖపట్నంలో పర్యటించిన నన్నపనేని రాజకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హత్యాయత్నం నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాజేశ్వరిని సైతం ఆమెను పరామర్శించారు. 

బీటెక్ విద్యార్థిని జోత్స్న మృతిపై అనుమానాలున్నాయని, వాస్తవాలు తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె పోలీసులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఇలాంటి ఘటనలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇకపోతే విశాఖపట్నం బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని అక్కయ్యపాలెంలోని లెక్చరర్‌ అంకుర్‌ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. అనుమానా స్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

నన్నపనేని రాజకుమారి గతంలో టీవీ సీరియల్స్ పై కీలక వ్యాఖ్యలు చేసేవారు. సీరియల్స్ ఆడవాళ్ళను నాశనం చేస్తున్నాయని అవి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు. 

సీరియల్స్ ను నిషేధించాలని కూడా డిమాండ్ చేసిన రోజులు లేకపోలేదు. గతంలో టీవీ సీరియల్స్ ను టార్గెట్ చేసిన నన్నపనేని రాజకుమారి రూట్ మార్చి సెల్ ఫోన్లపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 
 

click me!