ఆ విషయంలో చంద్రబాబు ఘనుడు: స్ట్రాంగ్ రూమ్స్ ను పరిశీలించిన వైసీపీ

Published : Apr 18, 2019, 04:42 PM IST
ఆ విషయంలో చంద్రబాబు ఘనుడు: స్ట్రాంగ్ రూమ్స్ ను  పరిశీలించిన వైసీపీ

సారాంశం

తమకు భద్రతపై నమ్మకం ఉందని అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.  

గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వారు పరిశీలించారు. 

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని నేతలు స్పష్టం చేశారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. 

తమకు భారతదేశంలోని వ్యవస్థలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారన్నారు. 

తమకు భద్రతపై నమ్మకం ఉందని అయితే వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు ఘనుడు కాబట్టే ఈవీఎంలను పరిశీలించడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు.  

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP