జగన్ తో వల్లభనేని వంశీ భేటీ వెనక... టీడీపీ జిల్లా నాయకత్వంపై కార్యకర్తలు ఫైర్

By narsimha lode  |  First Published Oct 28, 2019, 5:49 PM IST

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు అండగా నిలిచారు. వంశీ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఆయన వెంటే తాము నడుస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. 


గన్నవరం: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మద్దతు ప్రకటించారు ఆ నియోజకవర్గానికి  చెందిన టీడీపీ నేతలు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పలువురు నేతలు సోమవారం నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 

Also Read:సంచలనాలకు మారుపేరు వల్లభనేని వంశీ, ఇప్పుడూ అంతే

Latest Videos

ఈ నెల 27వ తేదీన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గన్నవరం ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడ వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. అంతేకాదు రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడ వంశీ ప్రకటించారు. ఈ మేరకు వల్లభనేని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.

Also Read:వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే

ఈ పరిణామాలపై నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నేతలు సోమవారం నాడు సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకొంటే ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

Also Read:వల్లభనేని వంశీ రాజీనాామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల నుండి వైదొలగాలని వంశీ తీసుకొన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడ కార్యకర్తలు, నేతలు కోరారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వంశీపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు.

మరో వైపు వల్లభేని వంశీపై అక్రమంగా కేసులు బనాయిస్తుంటే టీడీపీ జిల్లా నాయకత్వం ఎందుకు స్పందించలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ పరిణామం సరైంది కాదని వారు అభిప్రాయపడ్డారు.

Also Read:దేవినేని ఉమతో వల్లభనేని వంశీకి విభేదాలు: చంద్రబాబు లేఖలో ప్రస్తావన

గన్నవరం నియోజకవర్గంలో పార్టీని కాపాడుకొంటూ వల్లభనేని వంశీ అనేక పోరాటాలు నిర్వహించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. టీడీపీకి  వంశీ రాజీనామా చేసిన  తర్వాత  టీడీపీ నేతలు తాము అండగా ఉంటామని ప్రకటనలు చేయడాన్ని వాళ్లు గుర్తు చేశారు.వల్లభనేని వంశీ ఏ పార్టీలో చేరితే వంశీతో పాటు తామంతా ఆ పార్టీలో చేరుతామని వల్లభనేని వంశీ అనుచరులు ప్రకటించారు. 


 

click me!