బీజేపీ, వైసీపీ నేతలతో చర్చించే వంశీ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. వంశీతో పాటు మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇద్దరూ బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని ఆరోపించారు.
వైకాపా నేతల నుంచి బెదిరింపులు ఉంటే బీజేపీ అండగా ఉంటుందని.. ప్రజల కోసం పనిచేసే మచ్చలేని నేతలు తమ పార్టీలోకి రావొచ్చని రఘురాం ఆహ్వానించారు.
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్‌తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితం వంశీ.. తన మిత్రుడు కొడాలి నానితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో.. ఆయనతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వైకాపా నేతలు బాంబు పేల్చారు.
ఈ మధ్యలోకి బీజేపీ నేత రఘురాం వచ్చి చేరారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, వైసీపీ నేతలతో చర్చించే వంశీ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. వంశీతో పాటు మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇద్దరూ బీజేపీ, వైసీపీని సంప్రదిస్తున్నారని ఆరోపించారు.
undefined
వైకాపా నేతల నుంచి బెదిరింపులు ఉంటే బీజేపీ అండగా ఉంటుందని.. ప్రజల కోసం పనిచేసే మచ్చలేని నేతలు తమ పార్టీలోకి రావొచ్చని రఘురాం ఆహ్వానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read:సంచలనాలకు మారుపేరు వల్లభనేని వంశీ, ఇప్పుడూ అంతే
రాష్ట్రంలో ఏం జరుగుతోందో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని రఘురాం డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ రాజ్యం ఉండొచ్చు.. కానీ భవిష్యత్‌లో బీజేపీదే హవా అని రఘురాం జోస్యం చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అమిత్ షా -జగన్ భేటీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వంశీ ప్రత్యర్ధుల సవాళ్లకు ధీటుగానే స్పందించారు. కానీ, నకిలీ ఇళ్లపట్టాల కేసు విషయమై వంశీ టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరో వైపు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
మరోవైపు తన నియోజకవర్గంలోని రైతుల సమస్యపై ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా వల్లభనేని వంశీ రాజీనామా లేఖను అప్పట్లోనే సంధించారు. అయితే ఆ సమయంలో టీడీపీ నేతలు ఆయనకు సర్ధిచెప్పారు. రైతులకు అండగా వల్లభనేని వంశీ ఆందోళన కూడ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీ కొంచెం వెనక్కు తగ్గారు.
Also Read:వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే
2019 ఎన్నికలు పూర్తయ్యాక గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్ధి వెంకట్రావు గెలిస్తే తాను సన్మానం చేస్తానని ప్రకటించారు. వెంకట్రావు ఇంటికి వెళ్లాడు వల్లభనేని వంశీ. ఈ విషయమై యార్లగడ్డ వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ విషయమై ఫేస్‌బుక్ వేదికగా వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చిఎన్నికల్లో గెలుపొందారని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీపై ఆరోపణలు చేస్తున్నారు.ఈ విషయమై వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు వెనుక ఎవరున్నారనే విషయమై ఈ నెల 24 వతేదీన మెయిల్ ఆధారాలతో వంశీ మీడియాకు వివరించారు. ఆ మరునాడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో భేటీ అయ్యారు. అదే రోజు సాయంత్రం తన స్నేహితుడు, మంత్రి కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ ఏపీ సీఎం జగన్ ను కలిశారు.
Also Read:వల్లభనేని వంశీ రాజీనాామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది. వంశీ వైసీపీలో చేరుతోందనే ప్రచారం నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వల్లభనేని వంశీ పార్టీలో చేరకుండా అడ్డుకోవాలని కోరారు.
ఈ పరిణామాలతో ఈ నెల 28న ఏపీ సీఎం జగన్ ను కలుస్తానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. మరోవైపు వల్లభనేని వంశీ మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించుతూ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు రాజకీయాలకు కూడ గుడ్ బై చెబుతున్నట్టుగా వంశీ ప్రకటించారు.