
తిరుమల: ప్రతినెలా టీటీడీకి వడ్డీ వచ్చేలా బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు టీటీడీ పాలకవర్గం తీసుకొన్న నిర్ణయాలను వెల్లడించారు.
రూ. 50 కోట్లు రద్దైన నగదు నోట్లు టీటీడీ వద్దే ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఆర్బీఐతో సంప్రదించాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఎక్కువ వడ్డీకి బంగారం డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.
also read:తిరుమలలో కరోనా దెబ్బ: ఐదు జంటలకే మ్యారేజీ
ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీ నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.ఏకాంతంగానే ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.
also read:ఆగష్టు 28న టీటీడీ బోర్డు సమావేశం: బ్రహ్మోత్సవాలతో పాటు కీలక అంశాలపై చర్చ
అక్టోబర్ 16వ తేదీ నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి ఆలయాలు నిర్మిస్తామన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాలపై అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాన చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. వారణాసి, భువనేశ్వర్ లలో కూడ ఆలయాలను నిర్మిస్తామన్నారు.తిరుమలలో తాగునీటి మెయింటైన్స్ కోసం రూ. 10 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.