షెడ్యూల్‌ ప్రకారమే స్థానిక ఎన్నికలు, అమల్లోకి కోడ్: తేల్చేసిన ఏపీ ఎస్ఈసీ

By narsimha lodeFirst Published Jan 21, 2021, 11:56 AM IST
Highlights

ఏపీ హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

అమరావతి: ఏపీ హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 8వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.వచ్చే నెల 5,9,13,17 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషన్  తేల్చి చెప్పింది. 

also read:జగన్ సర్కార్‌కి హైకోర్టు షాక్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 11వ తేదీన హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేస్తూ ఆదేశించారు.ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం ముందు ఎన్నికల సంఘం సవాల్ చేసింది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను ఏపీ హైకోర్టు ధర్మాసనం  గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

దీంతో షెడ్యూల్ ప్రకారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపిన విషయాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

click me!