జగన్ సర్కార్‌కి హైకోర్టు షాక్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Jan 21, 2021, 10:51 AM IST
Highlights

ఏపీలో స్థానిక సంస్థలకు ఏపీ హైకోర్టు గురువారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.r Local body elections lns

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థలకు ఏపీ హైకోర్టు గురువారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఈ షెడ్యూల్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఫిబ్రవరి 4వ తేదీ నుండి నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం గతంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.ఈ షెడ్యూల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 11న  ఆదేశించారు.

 

ఏపీలో స్థానిక సంస్థలకు ఏపీ హైకోర్టు గురువారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ ఆదేశాలన సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మూడు రోజుల పాటు  ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు  గురువారం నాడు కీలక ఆదేశాలిచ్చింది.ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియ సాగించాలని ఏపీ హైకోర్టు సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

also read:ఏపీలో స్థానిక సంస్థలు: ఉద్యోగులకు షాకిచ్చిన హైకోర్టు

ఈ నెల 8వ తేదీన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది.ఏపీ హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పుతో ఈ నెల 23వ తేదీన స్థానిక సంస్థల ఎన్నిక నోటిఫికేషన్లను ఏపీ  ఎన్నికల సంఘం జారీ చేసే అవకాశం ఉంది.

మరోవైపు హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
 

click me!