టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ లైన్ దాటిందన్నారు. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యతని ఆయన తెలిపారు.
అమరావతి: Tdp గుర్తింపును రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఏపీరాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పై బూతు పదాలతో దూషించిన టీడీపీని, చంద్రబాబును ప్రజలంతా నిలదీయాలని Sajjala Ramakrishna Reddy కోరారు.జగన్ ఆపుతున్నారని అందుకే కార్యకర్తలు సహనంగా ఉన్నారని ఆయన చెప్పారు.
also read:పట్టాభి అరెస్ట్: తలుపులు పగులగొట్టి బలవంతంగా లాక్కెళ్లారని భార్య
undefined
సహనానికి ఓ హద్దు ఉంటుందని చెప్పారు.టీడీపీ లైన్ దాటిందన్నారు. ఏమైనా జరిగితే Chandrababuదే బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం తప్పే, కానీ ఆ ఆగ్రహానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు.బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ నేతలు ఉద్యమం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.సభ్య సమాజంలో ఉండే హక్కును చంద్రబాబు, టీడీపీ కోల్పోయిందన్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం Ys jagan పై చేసిన బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబునాయుడు టీడీపీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగాడు.మరోవైపు తనపై టీడీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరోసారి స్పందించారు. గిట్టనివారు పాలన చేస్తున్నారనే అక్కసుతో బూతులు మాట్లాడుతున్నారని సీఎం జగన్ చెప్పారు.టీడీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ జనగ్రహ దీక్షలను ఆ పార్టీ చేపట్టింది. టీడీపీ నేతలు సీఎం జగన్ కు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.