Huzurabad Bypoll: నన్ను కొట్టగలిగే శక్తి కేసీఆర్ కే కాదు ఆయన జేజమ్మకూ లేదు: ఈటల సీరియస్

By Arun Kumar PFirst Published Oct 21, 2021, 2:09 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలం మర్రిపల్లిలో పర్యటించారు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కరీంనగర్: తల కిందకు, కాళ్లు పైకి పెట్టి పబ్బతి పట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నమ్మబోరని... ఆయన అహంకారాన్ని ఓడించడానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తనను కొట్టగలిగే శక్తి కేసీఆర్ కే కాదు ఆయన జేజమ్మకు కూడా లేదన్నారు. నీకే తెలివి, డబ్బులు, ప్రజాబలం ఉన్నాయనుకుంటే పొరబడినట్లేనని... ఎన్ని దావతులిచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా, చివరకు ఓటుకు రూ.20 వేలు ఇచ్చినా కేసీఆర్ ను ప్రజలు నమ్మరన్నారు. తానేంటో హుజురాబాద్ ప్రజలకు బాగా తెలుసని ఈటల పేర్కొన్నారు.    
 
huzurabad bypoll ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలం మర్రిపల్లిలో eatala rajeder పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గతంలో దళితులను అవమానించి గంజిలో ఈగలాగా kcr తీసేసారన్నారు. ఇప్పుడు వారిపై ప్రేమతో dalit bandhu ఇస్తున్నట్లు... ఇతరులు దీన్ని ఆపుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. 

''తాత్కాలికంగా నిజం ఓడిపోయినట్లు కనిపించొచ్చు.. కానీ నిజం నిప్పులాంటిది. తప్పకుండా బయటకు వస్తుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణలో 85 శాతం దళిత, బీసీలే ఉన్నారన్నారు. దళితుడినే మొదటి సీఎం చేస్తానన్నారు. తల నరుక్కుంటా తప్ప మాటతప్పనన్నాడు. కాపలాకుక్కలా ఉంటానన్నాడు. కానీ దళితులకిచ్చిన మాటతప్పి ఆయనే సీఎం అయి మొదటి ద్రోహం వారికే చేసాడు'' అని ఆరోపించారు. 

read more  Huzurabad Bypoll: దళిత బంధుని ఆపాలని నేను లేఖ రాసినట్టు నిరూపిస్తారా?.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బండి

''మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టాడు... double bedroom ఇండ్లు ఇవ్వలేదు. dalit pride అనే స్కీం పెట్టినా వారికి రావాల్సిన రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నాడు. ఇప్పుడేమో చివరి రక్తం బొట్టు వరకు దళితులకే తన జీవితం అంకితమంటున్నాడు. కేసీఆర్ మోసాన్ని గ్రహించకుండా కొంతమంది మేధావులు ఆహా ఓహో అంటున్నారు'' అన్నారు. 

వీడియో

''దళితబంధును ఎవరూ వద్దనడం లేదు. కానీ పదిలక్షలపై  సంపూర్ణ అధికారం ఇవ్వాలంటున్నాం. మన కళ్లల్లో మట్టికొట్టి, మన బతుకులను చిద్రం చేసాడు కేసీఆర్. తన తర్వాత తన కొడుకు KTR ఆ తర్వాత తన మనవడు Himanshu రాష్ట్రాన్ని ఏలాలనే ఎజెండాతో కేసీఆర్ పనిచేస్తున్నాడు'' అని ఈటల ఆరోపించాడు. 

PHOTOS  Huzurabad Bypoll: ఈటల రాజేందర్ ప్రచార హోరు... బ్రహ్మరథం పడుతున్న ప్రజానికం (ఫోటోలు)

''నన్ను విడిచి పోయినవాళ్ల బతుకు 30తర్వాత బజారున పడుతుంది. ఎమ్మెల్యేలను, మంత్రులనే లెక్కచేయని కేసీఆర్... వీళ్లను ఎలా దేకుతాడు. కోట్ల రూపాయల ఖర్చు చేసి, పదుల కొద్ది మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి నన్ను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 30 వరకు మాత్రమే మీరు మాట్లాడుతారు. ఆ తర్వాత ప్రతీ మాటకు బదులు తీర్చుకుంటా... మిమ్మల్ని నిద్రపోనీయను'' అని ఈటల హెచ్చరించారు.

click me!