
కాకినాడ నగరాన్ని దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీగా మార్చుతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాకినాడను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. పేదలకు అండగా ఉంటానని చంద్రబాబు మరోసారి స్పషం చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కృషి చేస్తాన్నారు.
విశాఖ నుంచి కాకినాడకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను నిర్మిస్తామని, పెట్రో కెమికల్ కారిడార్ కు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అది వస్తే.. కాకినాడ దశ మారుతుందన్నారు. అంతేకాకుండా నగరంలో లాజిస్టిక్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కాకినాడ నుంచి పాండిచ్చేరికి జలరవాణా మార్గం ఏర్పాటుచేస్తామన్నారు. బకింగ్‌హామ్ కెనాల్‌తో కాకినాడకు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 250 కోట్లతో ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం కింద క్లిక్ చేయండి