
నంద్యాల ఉపఎన్నిక ఫలితంపైనే వైసీపీ భవిషత్తు ఆధారపడిందని మంత్రి ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. మరో 44 గంటల్లో రాష్ట్రంలో వైసీపీ క్లోజ్ కాబోతోందని ఆయన తెలిపారు. నంద్యాలలో ఓటమి భయంతోనే వైసీపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఏహెచ్‌పీ పక్కాగృహాల భూమిపూజ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులోని నూతన గృహ నిర్మాణాల కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.కొన్ని గంటల్లో నంద్యాల ఎన్నికల ఫలితాలు రానున్నాయని, టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ ఓడిపోతే వైసీపీ పని పూర్తయినట్లేనని, భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా లాక్కుంటామని ఆయన తెలిపారు. ఆ పార్టి అవినీతితో కూడిన నేతలకు కేరాఫ్ అడ్రస్ అని తెలిపారు. ప్రజల మధ్య మొదటి నుండి ఆ పార్టి పూర్తి వ్యతిరేకత ఉందని కారణం ఆ పార్టి ఆధినేత అని పెర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి.