
తెలుగు దేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహాన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను మూడున్నర సంవత్సరాలుగా ఆమలుపర్చడంలో విఫలమైన టీడీపీని ఇంటికి పంపాలని వైఎస్ జగన్ రోడ్ షో లో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన కాకినాడ మున్సిపాల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గోని అధికార పార్టీ పై నిప్పులు చెరిగారు.
వైసీపీకి ఓటు వేస్తే ఏంలాభం అన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పై జగన్ కౌంటర్ ఇచ్చారు.. చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుందన్నారు. బాబు పాలన అంతా అవినీతి మయం అని, ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదని తెలిపారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. లేకుంటే 2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. ఇన్నాళ్ల నుండి రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. బెల్ట్ షాపులన్నీరద్దు చేస్తామన్నారు. కానీ, ఇప్పుడు వీధికొక బెల్ట్ షాపు కనిపిస్తోందన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా.. జగన్ ప్రశ్నించారు.
టీడీపీ నాయకులను అవినీతికి ఆటకట్టించే అవకాశం సాధారణ ఎన్నికల కన్న ముందుగానే వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని కాకినాడ ప్రజలు ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని నూతన వార్తావిశేషాల కోసం కింద క్లిక్ చేయండి .ttps://goo.gl/QTcdP2