చంద్రబాబుపై కోర్టుకెళతాం..వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

First Published Jan 23, 2018, 4:14 PM IST
Highlights
  • చంద్రబాబే కాదు తాము కూడా కోర్టుకు వెళ్లగలమని హెచ్చరించారు.

కేంద్రం విభజన హామీలను అమలు చేయడం లేదని కాబట్టి సుప్రీం కోర్టుకు వెళ్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబే కాదు తాము కూడా కోర్టుకు వెళ్లగలమని హెచ్చరించారు. చంద్రబాబు విభజన హామీలపై వెళ్తే  తాము రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామన్నారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబు కోర్టుకు వెళ్తే తాము ఏం చేస్తామో చూపిస్తామన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలంటే తమ వద్ద వంద అంశాలున్నాయన్నారు.  బీజేపీని 2019 నాటికి ఏపీలో జీరో చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు  టక్కుటమార విద్యలు 2004కు ముందు నడిచాయి గాని  ఇప్పుడు నడవదన్నారు.

కొన్ని పత్రికలను చేతిలో పెట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారని ఒక సోము మండిపడ్డారు. గతంలో బీజేపీతో పొత్తు చారిత్రాత్మిక తప్పదమని పాదయాత్రలో, మసీదుల్లో చెప్పిన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో మరోసారి పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీకి బలం లేదంటున్న టీడీపీ నేతలు అలాంటప్పుడు పొత్తు ఎందుకుపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిందని తెలియగానే చంద్రబాబు పొత్తుల కోసం చర్చలకొచ్చారని వివరించారు. అలా ఎందుకు దిగివచ్చారో మీడియాకు దమ్ముంటే చంద్రబాబునే ప్రశ్నించాలని సోము వీర్రాజు సవాల్ చేశారు.

click me!