పీవీ రమేష్ పేరేంట్స్ కు నోటీసులు: సంబంధంలేదన్న సీఐడీ సునీల్ కుమార్

By narsimha lodeFirst Published Jan 19, 2022, 3:06 PM IST
Highlights

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ తల్లిదండ్రకుల నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ కాదని , సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్: రిటైర్డ్ IAS అధికారి PV Ramesh తల్లిదండ్రులకి  నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ పోలీసులు కాదని సీఐడీ చీఫ్ Sunil Kumar తేల్చి చెప్పారు.ఇవాళ హైద్రాబాద్ లోని కొండాపూర్ లో పీవీ రమేష్ ఇంటికి ముగ్గురు అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. సీఐడీ అధికారులే ఈ నోటీసులు ఇచ్చారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై  సునీల్ కుమార్ వివరణ ఇచ్చారు.

Vijayawada పడమట పొలిసు స్టేషన్ లో నమోదైన  కేసు లో నోటీసులు విజయవాడ పోలీసులు  నోటీసులు ఇచ్చారని సీఐడీ అధికారులు తెలిపారు. 2018  పీవీ రమేష్ తమ్ముడి భార్య గృహ హింస కేసులో నిందితులుగా పీవీ రమేష్ తల్లి తండ్రులున్నారని సీఐడీ అధికారులు చెప్పారు. ఈ విషయమై 2018  లో కేసు నమోదైంది. తనకు ఈ నోటీసులతో ఎలాంటి సంబంధం లేదని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తేల్చి చెప్పారు.తనపై పీవీ రమేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సునీల్ కుమార్ చెప్పారు.
 

click me!