మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన

Published : Mar 06, 2022, 03:06 PM ISTUpdated : Mar 06, 2022, 04:13 PM IST
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన

సారాంశం

మూడు రాజధానులకు తాము ఇంకా కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారంగానే ముందుకు వెళ్లాలని ఇటీవలనే ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన విషంయం తెలిసిందే.


శ్రీకాకుళం: Three capitals అంశానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తేల్చి చెప్పారు. ఆదివారం నాడు Dharmana Krishna Das   శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. Amaravathi లోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా మూడు  రాజధానుల ప్రతిపాదన చేశామని తెలిపారు. TDP అధినేత Chandrababu Naidu చేసిన పని స్వార్థపూరితమైనదని ఆయన చెప్పారు. ఒక సామాజికవర్గ ప్రయోజనం కోసమే చంద్రబాబు తపనపడుతున్నారని ధర్మాన కృష్ణప్రసాద్ విమర్శించారు. 

మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు ఈ నెల 3న కీలక తీర్పును ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారంగా ముందుకు వెళ్లాలని కూడా సూచించింది. అమరావతిని అభివృద్దిని  కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తెలిపింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని కూడా ఆదేశించింది.  మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది.

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వకూడదని కూడా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని కూడా తరలించకూడదని సూచించింది. పిటిషన్ల ఖర్చుల కోసం రూ.50వేలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసును విచారించొద్దన్న పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టు తీర్పుపై అమరావతి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం వెనుక చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉందని వైసీపీ ఆరోపించింది. ఈ విషయమై మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలికంగా అసెంబ్లీతో పాటూ సెక్రటేరియట్ కూడా నిర్మించారు.. హైకోర్టును కూడా ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్  పాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు.  ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు లాయర్లు కోర్టును కోరారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu