ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం శివుని అగ్నిరూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి రామాయణంతో దగ్గరి సంబంధం ఉంది. ఆలయ సముదాయంలో హిందూ దేవతలు విగ్రహాలుంటాయి. విష్ణువు, పాపనేశ్వరుడు, లక్ష్మి, గణేష్, దుర్గామాత విగ్రహాలుంటాయి.
ఇవాళ పుట్టపర్తి విమానాశ్రయం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా లేపాక్షి ఆలయానికి చేరుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆలయంలోని శిల్పకళను చూశారు. ఆలయంలో తోలు బొమ్మలాటను మోడీ తిలకించారు. రాముడి జీవిత చరిత్రను తోలుబొమ్మలాటగా ప్రదర్శించారు. ఆలయంలో ఆరతి సమయంలో రంగనాథ రామాయణంలోని తెలుగు పద్యాలను విన్నారు.
undefined
also read:పుట్టపర్తికి మోడీ: లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
సంప్రదాయ దుస్తుల్లో ఆలయంలో ప్రధాన మంత్రి మోడీ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. అంతేకాదు ఆలయంలోని వేలాడే స్థంభం గురించి మోడీకి అధికారులు వివరించారు.
మరో వీడియో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీరామ్ జైరామ్ అంటూ భజన చేస్తూ కన్పించారు. లేపాక్షి దేవాలయం రామాయణంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. సీతను రావణుడు అపహరించుకొని వెళ్తున్న సమయంలో జటాయువు అడ్డుపడుతుంది.ఈ సమయంలో రావణుడి దాడిలో జటాయువు గాయపడి ఇక్కడే పడిందని స్థల పురాణం చెబుతుంది.
PM Shri performs Pooja & Darshan at Veerbhadra Temple in Puttaparthi, Andhra Pradesh. https://t.co/9y6q7L1uaD
— BJP (@BJP4India)
జానపథ కథల మేరకు రాముడు ఈ ప్రదేశానికి చేరుకున్న తర్వాత పక్షి పరిస్థితిని చూసి చలించిన రాముడు లేపక్షి అని పిలిచాడు. అదే కాలక్రమంలో లేపాక్షిగా మారిందని చెబుతున్నారు. రావణుడు సీతను దక్షిణం వైపునకు తీసుకెళ్లాడని జటాయువు చెప్పిందని పురాణ గాధలు చెబుతున్నాయి. అయోధ్యలోని రామ మందిరానికి ఈ నెల 22న ప్రాణప్రతిష్ట జరగనుంది. ఇటీవలనే నాసిక్ లో కాలా రామ మందిరంలో మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మోడీ ఇవాళ లేపాక్షి ఆలయంలో పూజలు చేశారు.