చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ కు బదిలీ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
also read:స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?
undefined
జస్టిస్ అనిరుద్దబోస్ ఏం చెప్పారంటే...
*చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తిస్తుంది.
* సెక్షన్17 ఏ ప్రకారం అరెస్ట్ కు ముందు అనుమతి తీసుకోవాల్సిందే.
*ముందస్తు అనుమతి లేకపోతే తీసుకున్న చర్యలు చట్ట విరుద్దం.
*అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం విచారణ చేయడం తగదు.
*అయితే రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయడం కుదరదు.
*ముందస్తు అనుమతి తీసుకోకపోయినా రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేం.
*సెక్షన్ 13 (1), సీ,డీ... సెక్షన్ 13 (2) ప్రకారం బాబును విచారణ చేయలేరు.
*పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నట్టుగా తెలిపారు.
జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయాలు
*చంద్రబాబుకు 17 ఏ వర్తించదు.
*చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి ఈ సెక్షన్ ను వర్తింపజేయలేం.
*2018లో జరిగిన చట్ట సవరణలో క్లారిటీలో లేదు
*సెక్షన్ 17 ఏ ఎప్పటినుండి అమల్లోకి వస్తుందో ప్రస్తావించలేదు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వై.ఎస్. షర్మిలకు: సీడబ్ల్యూసీలోకి గిడుగు
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెక్షన్ 17 ఏ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. దరిమిలా ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ కు బదిలీ చేశారు. ఈ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని ద్విసభ్య ధర్మాసనం కోరింది. ఈ విషయమై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ ను ఏ ధర్మాసనానికి కేటాయిస్తారోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
also read:సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు: బాబు పిటిషన్ సీజేఐకి బదిలీ
2023 సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది.గత ఏడాది సెప్టెంబర్ 22న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు 50 రోజుల తర్వాత రాజమండ్రి జైలు నుండి 2023 అక్టోబర్ లో విడుదలయ్యారు. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ మాసంలో రెగ్యులర్ బెయిల్ కూడ మంజూరు చేసింది.