
ఓటు వేయాలనే అతడి సంకల్పం ముందు అనారోగ్యం కూడా తలవంచింది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా 80 శాతానికి మించి ఓటింగ్ పెద్దగా పోల్ కావడం లేదు. బాగా చదవుకొని, సమాజం మీద చైతన్యం ఉన్న ప్రజలే ఓటు వేయడానికి నిరాసక్తత చూపుతుంటారు. క్యూలో నిలబడటానికి తెగ ఇబ్బంది పడుతుంటారు. అయితే ఏపీలోని గుడివాడకు చెందిన ఈయన అనారోగ్యంతో మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉన్నా కూడా ఇలా అంబులెన్స్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.