చంద్రబాబుపై జర్నలిస్టుల మండిపాటు

Published : Apr 09, 2017, 06:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చంద్రబాబుపై జర్నలిస్టుల మండిపాటు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులో చీలిక వచ్చింది. కొందరు జర్నలిస్టులను చేరదీసిన ప్రభుత్వంలోని ముఖ్యులు వారితో వేరు కుంపటి పెట్టుకునేట్లుగా ప్రోత్సహించారు. దాంతో ఏపిజెఎఫ్ పేరుతో మరో కొత్త యూనియన్ ఏర్పడింది.

జర్నలిస్టులు చంద్రబాబునాయుడుపై మండిపడుతున్నారు. ఏపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడిన వక్తలందరూ చంద్రబాబు వైఖరిపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులో చీలిక వచ్చింది. కొందరు జర్నలిస్టులను చేరదీసిన ప్రభుత్వంలోని ముఖ్యులు వారితో వేరు కుంపటి పెట్టుకునేట్లుగా ప్రోత్సహించారు. దాంతో ఏపిజెఎఫ్ పేరుతో మరో కొత్త యూనియన్ ఏర్పడింది. అప్పటి నుండి ప్రతీ విషయంలోనూ యూనియన్ల మధ్య పోటీ పెరిగిపోయింది.

మొన్ననే ఏపిజెఎఫ్ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. దానికి సిఎంను ముఖ్య అతిధిగా ఆహ్వానించినా సిఎం హాజరుకాలేదు. అయితే, సదస్సు నిర్వహణకు మాత్రం కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలు అందించారని ప్రచారమైతే జరిగింది. దాంతో తాజాగా జరిగిన ఏపియూడబ్ల్యుజెఎఫ్ సమావేశంపై అందరి కళ్ళూ పడ్డాయి. దానికి తగ్గట్లే సమావేశం కూడా విజయవంతమైనట్లే చెప్పాలి.

సదస్సుకు హాజరైన జర్నలిస్టు నేతలు మాట్లాడుతూ, చంద్రబాబు జర్నలిస్టులపై అసహనం, కోపం ప్రదర్శించటం మంచిదికాదని హితవుపలికాయి. తన ఆలోచనల్లో మార్పు రావాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారానికి సిఎం గనుక కృషి చేయకపోతే ఆమరణదీక్షకు సిద్ధమంటూ హెచ్చరించారు. పనిలో పనిగా వక్తలు కొన్ని డిమాండ్లు కూడా చేశారు.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 50 కోట్లు కేటాయించాలన్నారు. మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డుల అమలుకు ఓ కమిటి ఏర్పాటు  చేయాలని, విశ్రాంత జర్నలిస్టులకు రూ. 10వేల ఫించన్ సౌకర్యం కల్పించాలన్నారు. అమరావతిలో పనిచేసే జర్నలిస్టులకు పక్కా గృహాలు మంజూరు చేయాలనేటు వంటి డిమాండ్లు చేసారు. సరే, డిమాండ్లు నెరవేరుతాయా లేదా అన్నది వేరే సంగతి. తాజా డిమాండ్లకు సిఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu