
- రాష్ట్రంలో 1.42 లక్షల ఖాళీలు
- రిటైర్మెంట్ ఖాళీలు మరో 79 వేలు
- 45 వేలకు పైనే ఉపాధ్యాయ ఖాళీలు
- పోలీస్ శాఖలో 15 వేల ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ మెంట్ క్యాలెండర్ విడుదల చేయగానే మొదట ఆశ్చర్యపోయింది, ఆంద్రోళ్లు కాదు, తెలంగాలణా నిరుద్యోగులు. ఉద్యోగాల గురించి రోజూ మాట్లాడుతున్నకెసిఆర్ ప్రభుత్వం చేయలేని పని ఆంధా ప్రభుత్వం చేసిందని తెలంగాణా నిరుద్యోగుల తెగమెచ్చుకున్నారు. అయితే, ఈ క్యాలెండర్ ఆంధ్రాయువకులను పెద్దగా ఆనంద పరచలేదు.ఎందుకంటే, క్యాలెండర్ లో క్లారిటీ లేదు. ప్రభుత్వంలో ఎన్నిఖాళీలున్నాయి, ఎన్నింటికి రిక్రూట్ చేస్తారనేవిషయాన్ని తెలంగాణా లాగే స్టేట్ సీక్రెట్ లాగా తెలుగుప్రభుత్వాలు చూస్తున్నాయి. కరెక్టుగా ఒక్క సారి కూడా ఎన్ని ఉద్యోగాలున్నాయో అమరావతి , హైదరాబాద్ లలో ఎవరు చెప్పడం లేదు.
ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రు.2000 నిరుద్యోగ భృతి అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల నినాదం. ఇదెపుడో బంగాళా ఖాతంలో పడిపోయింది.
ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోయినా, ఉన్న ఖాళీలు నింపితేచాలని సంవత్సరాలుగా హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటూ, అష్టకష్టాలు పడి బతుకీడుస్తున్న నిరుద్యోగులు కోరుతున్నారు. చాలా మంది యువకులు ఆంధ్రలోనితమ వూర్లకు కూడాపోలేకపోతున్నారు. యాడ్ పడుతుందేమోనని ఆత్రుత. ఇక్కడ ఖర్చు భరించలేని పరిస్థితి. నారా లోకేశ్ కు మంత్రి మండలిలో ఉద్యోగం రావడమే ఇంటింటికి ఉద్యోగం... నిరుద్యోగ భృతి అనుకోవాలేమో...
ఈ నేపథ్యంలో ఎపిపిఎస్ సి పోటీ పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది. అయితే, ఎన్ని ఉద్యోగాలున్నాయో మాత్రం వెల్లడించడం లేదు.
మేం సేకరించిన వివరాల ప్రకారం ఆంధ్ర ఉద్యోగాల పుట్ట కావాలి. ఎందుకంటే లెక్కలేనన్ని ఖాళీలున్నాయి రాష్ట్రంలో. 2014 నుంచి ఇప్పటి దాకా ఈ మూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు మొత్తం పది వేలకు మించవు. అంతా తెలుగుదేశం వాళ్లు సెలెబ్రేట్ చేసుకున్న మేజర్ రిక్రూట్మెంట్ ఒక్కటే. అది లోకశ్ కు ఉద్యోగమనుకోవాలి.
2016 ఫిబ్రవరిలో 20,250 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పింది. మరో 10 వేల ఉద్యోగాలు 2017లో భర్తీ చేస్తామని మేలో ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఉద్యోగాల్నీ ఎపిపిఎస్‌సి ద్వారానే భర్తీ చేస్తామని కూడా చెప్పారు. మరి జరిగిందేమిటి?
2016లో కేవలం 4009 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చింది.దీనితో వచ్చిన అసంతృప్తిని కోపాన్ని చల్లార్చేందుకు 2017లో మరికొన్ని పోస్టులు భర్తీ చేస్తామంటూ ఎపిపిఎస్‌సి క్యాలెండర్‌ను విడుదల చేసింది. 42 విభాగాల్లో ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పినా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామనే స్పష్టత ఇవ్వలేదు.
రాష్ట్రంలో 1.42 లక్షల ఖాళీలున్నాయి
ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్‌నాధ్ కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,42,825 ఖాళీలున్నాయి. వీటితో పాటు ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ మూడేళ్లలో వివిధ శాఖల్లో రిటైర్మెంట్ అయిన పోస్టులు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ద్వారా ఏర్పడిన ఖాళీలు మరో 79 వేల వరకు ఉంటాయి. ఇవి కాకుండా ఉపాధ్యాయ ఖాళీలు మరో 45 వేల వరకు ఉన్నాయి. ఇక పోలీసు శాఖలో మరో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నాయంటోంది. అంటే విభజనానంతరం కనిపించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల్లో ప్రభుత్వం చెప్తున్న 77,737 పోస్టులు పోనూ మిగిలిన పోస్టులేయ్యాయి.
ఈ కారణాన ఉద్యోగాల భర్తీ జాప్యం వల్ల నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్నందేమోననే భయంతో,వారిని భ్రమల్లి తోసేందుకు 'ఎపిపిఎస్‌సి క్యాలెండర్' యువకుల మీద ప్రయోగించినట్లు అర్థమవుతుందని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు చెబుతున్నారు.