విశాఖ శ్వేత ఆత్యహత్య కేసులో కీలక పరిణామం.. దర్యాప్తు దిశా పోలీసులు చేతికి

By Siva KodatiFirst Published Apr 28, 2023, 3:34 PM IST
Highlights

వివాహిత శ్వేత మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును దిశా పోలీసులకు అప్పగించారు విశాఖ న్యూపోర్ట్ పోలీసులు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివాహిత శ్వేత మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును దిశా పోలీసులకు అప్పగించారు విశాఖ న్యూపోర్ట్ పోలీసులు. నిందితులను ఇవాళ రిమాండ్‌లోకి తీసుకోబోతున్నారు దిశా పోలీసులు. శ్వేత మిస్టరీ మృతి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం కానుంది. శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆమె ఆడపడుచు భర్త సత్యం వాట్సాప్ చాట్ కీలకం కాబోతోంది.

సత్యంపై ఆరోపణలు రాగానే.. తన ఫోన్‌లోని మెసేజ్‌లను డిలీట్ చేశాడు.  సత్యం తన బిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు శ్వేత తల్లి రామాదేవి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో శ్వేత అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు.. సత్యంపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని భర్తకు చెప్పినా శ్వేతతోనే క్షమాపణలు చెప్పించారని రమాదేవి ఆరోపించారు. 

Latest Videos

కాగా.. విశాఖ బీచ్ లో యువతి మృతదేహం కేసులో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్ లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ మార్చురీలో ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది.  

Also Read: వివాహిత శ్వేత మృతి కేసు : పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది? ఆసక్తిగా మారిన నివేదిక...

ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను డాక్టర్లు పోలీసులకు అందించారు. ఈ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  మొదట శ్వేత మృతిని ఆత్మహత్యగా అనుకున్నారు.  కానీ ఆమె మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండడంతో.. అనుమానాస్పద మృతిగా కేసును విచారణ చేపట్టారు. విశాఖ మూడో పట్టణ పోలీసుల చేతుల్లో ప్రస్తుతం ఈ పోస్టుమార్టం నివేదిక ఉంది.

వివాహిత శ్వేత చనిపోయే సమయానికి ఐదు నెలల గర్భిణీ.  ఆమె అనుమానాస్పద మృతి విషయంలో భర్త, అత్తా,మామ, ఆడపడుచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్వేత పోస్టుమార్టం తర్వాత.. అత్తింటి వారంతా పోలీసుల అదుపులోనే ఉండడంతో.. ఆమె మృతదేహాన్ని తల్లి రమ,  బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారంనాడు కాన్వెంట్ కూడలి దగ్గర్లోని స్మశాన వాటికలో శ్వేత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
 

click me!