ఎస్పీ వస్తున్నారు.... తప్పుకోండి: డీఎస్పీ పై మంత్రి జోగి రమేష్ ఫైర్

Published : Apr 28, 2023, 01:15 PM IST
ఎస్పీ వస్తున్నారు.... తప్పుకోండి: డీఎస్పీ పై  మంత్రి  జోగి రమేష్  ఫైర్

సారాంశం

డీఎస్పీ వ్యవహరించిన తీరుపై  ఏపీ మంత్రి జోగి రమేష్  సీరియస్ అయ్యారు.  ఎస్పీ వస్తున్నారని  మంత్రిని  తప్పుకోవాలని  డీఎస్పీ   కోరడంపై  మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.    

విజయవాడ:  కృష్ణా జిల్లాలో  డీఎస్పీ తీరుపై  ఏపీ మంత్రి  జోగి రమేష్  సీరియస్ అయ్యారు.  శుక్రవారంనాడు మైలవరంలో ఈ ఘటన  చోటు  చేసుకుంది.మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  అబివృద్ది  కార్యక్రమాల  సమీక్ష కార్యక్రమానికి  ఏపీ పర్యాటక శాఖ మంత్రి  ఆర్ కే రోజా  ఇవాళ  వచ్చారు. మంత్రి రోజాకు  రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ వద్ద  మంత్రి జోగి రమేష్ , పలువురు అధికారులు   స్వాగతం పలికేందుకు  చేరుకన్నారు.  మంత్రి  రోజాకు  బోకేలు  ఇచ్చి స్వాగతం చెబుతున్నారు. అయితే  అదే సమయంలో ఎస్పీ వస్తున్నారని  మంత్రి జోగి రమేష్ ను పక్కకు తప్పుకోవాలని  డీఎస్పీ  కోరారు.  ఈ విషయమై  మంత్రి జోగి రమేష్  డీఎస్పీపై  సీరియస్ అయ్యారు.   డీఎస్పీ తీరును జోగి రమేష్ తప్పు బట్టారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్