త్వరలోనే విశాఖ నుండి పాలన: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో జగన్

By narsimha lode  |  First Published Mar 3, 2023, 1:12 PM IST


విశాఖ పట్టణం  ఏపీ రాష్ట్రానికి  పరిపాలన రాజధానిగా మారనుంది.  ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  మరోసారి  ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్  సమ్మిట్ లో  ఈ విషయాన్ని 
 


విశాఖపట్టణం  త్వరలోనే పరిపాలన రాజధాని  అని  ఏపీ సీఎం  వైఎస్ జగన్  ప్రకటించారు.. త్వరలోనే  విశాఖపట్టణం నుండి పరిపాలన సాగించనున్నట్టుగా   సీఎం  తేల్చి చెప్పారు.గురువారంనాడు  విశాఖపట్టణంలోని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో  సీఎం  జగన్  ఈ విషయాన్ని  స్పష్టం  చేశారు.

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది.  2014లో  ఏపీ సీఎం గా  ఉన్న  చంద్రబాబునాయుడు అమరావతిని  రాజధానిగా  ప్రకటించారు. అమరావతిలో  రాజధాని నిర్మాణం  కోసం శంకుస్థాపన  కూడా  చేశారు.ఈ కార్యక్రమంలో   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా  పాల్గొన్నారు. 

Latest Videos

undefined

రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాల్లో అభివృద్ది   జరగాలనే  ఉద్దేశ్యంతో  విశాఖపట్టణాన్ని  పరిపాలన రాజధానిగా  జగన్  ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి  శాసనస రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా  ఉంటుందని  జగన్ సర్కార్ తేల్చి చెప్పింది. 

అమరావతినే రాజధానిగా  కొనసాగించాలని  కోరుతూ   అమరావతి జేఏసీతో పాటు  పలు పార్టీలు  దాఖలు  చేసిన   పిటిషన్ పై  ఏపీ హైకోర్టు  2022 మార్చి మాసంలో  కీలక తీర్పును వెల్లడించింది.  రాజధానిపై  చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు  లేదని  హైకోర్టు తెలిపింది.ఈ విషయమై  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో  సవాల్  చేసింది.  అయితే  ఈ విషయమై  కొన్ని అంశాలపై  సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.   ఈ విషయమై  సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీన విచారించనుంది. ఈ నెల  28వ తేదీ కంటే  ముందే  ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం  నిన్న కూడా  పిటిషన్ దాఖలు  చేసింది.  సుప్రీంకోర్టు  అందుకు  అంగీకరించలేదు.  ఈ నెల  28వ తేదీన  ఈ పిటిషన్  ను విచారించనున్నట్టుగా  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
also read:ఏపీకి త్వరలో విశాఖపట్టణం రాజధాని: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  విపక్షాలు  కోరుతున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని  విపక్షాలు తప్పుబడుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను  ఈ ఏడాది జనవరి  21న  న్యూఢిల్లీలో  నిర్వహించారు.ఈ సమావేశంలో  కూడా విశాఖపట్టణం  ఏపీకి  పరిపాలన రాజధానిగా మారనుందని  జగన్  ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇవాళ కూడా   ఇవే  వ్యాఖ్యలు  చేశారు.  మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని  జగన్  తేల్చి చెప్పారు.


 

click me!