ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది వైపునకు దూసుకుపోతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు.
విశాఖపట్టణం:నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించనుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు.గురువారంనాడు విశాఖపట్టణంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగించారు.
విశాఖపట్టణంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగస్వామ్యమైనందుకు గాను తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. రిలయన్స్ సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ రాష్ట్రానికి చెందినవారున్నారని ఆయన చెప్పారు. తిరుపతి, విశాఖపట్టణం వంటి పట్టణాలతో పాటు అనేక సహజ వనరులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంబానీ ఆయన తెలిపారు.. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ రాష్ట్రానికి చెందినవారున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
undefined
also read:విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ సహా పలువురు హజరు
దేశానికి , రిలయన్స్ కి ఏపీ రాష్ట్రం చాలా అవసరమన్నారు. సుదీర్థ తీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రం ఏపీగా ఆయన పేర్కొన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది వైపు దూసుకుపోతోందని ఆయన చెప్పారు.ఏపీలో జియో నెట్ వర్క్ అభివృద్ది చెందిన విషయాన్ని అంబానీ గుర్తు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ నుండి మంచి సహకారం అందుతుందని ఆయన చెప్పారు.