నూతన్‌నాయుడికి చుక్కెదురు: బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

By narsimha lodeFirst Published Sep 16, 2020, 10:24 AM IST
Highlights

పెందుర్తి దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడు సహా మరికొందరు నిందితులు దాఖలు చేసుకొన్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది


విశాఖపట్టణం: పెందుర్తి దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడు సహా మరికొందరు నిందితులు దాఖలు చేసుకొన్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.విశాఖనగరంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వెంకటనాగేశ్వరరావు ఈ బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.

శ్రీకాంత్ శిరోముండనం కేసులో రిమాండ్ లో ఉన్న నిందితులు నూతన్ నాయుడు ఆయన భార్య ప్రియమాధురి సహా మరికొందరు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ పిటిషన్లను మంగళవారం నాడు తిరస్కరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు.

also read:నూతన్‌నాయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: మాజీ ఐఎఎస్ అధికారి పేరుతో ఫోన్లపై ఆరా

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ ఈ కేసులో తన వాదనలను విన్పించారు.ఈ కేసులో నూతన్ నాయుడిని ఈ నెల 4వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నూతన్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందే నూతన్ నాయుడు భార్య ప్రియామాధురి సహా పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు పలువురికి ఫోన్లు చేసినట్టుగా కూడ మరో కేసు కూడ నూతన్ నాయుడిపై నమోదైంది. 

click me!