విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయం, భక్తుల కలవరం

By team teluguFirst Published Sep 16, 2020, 10:06 AM IST
Highlights

తాజాగా అమ్మవారి వెండి రథానికి ఉండవలిసిన నాలుగు వెండి సింహాల్లో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. మూడు సింహాలు చోరీకి గురవడం, ఆ విషయం గురించి ఇన్ని రోజులుగా కప్పిపెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమయింది. 

విజయవాడ దుర్గ గుడికి సంబంధించియున్న మరో వార్త తీవ్ర వివాదస్పదమయ్యేలా కనబడుతుంది. నిత్యం ఏదో ఒక అంశం వినువాదమవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. తాజాగా అమ్మవారి వెండి రథానికి ఉండవలిసిన నాలుగు వెండి సింహాల్లో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. మూడు సింహాలు చోరీకి గురవడం, ఆ విషయం గురించి ఇన్ని రోజులుగా కప్పిపెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమయింది. 

ప్రతి ఏడాది ఉగాది పర్వదినం నాడు దుర్గ మల్లేశ్వరులను వెండి రథంపై అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. గత ఏడాది కూడా అలానే నిర్వహించారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆ ఊరేగింపు జరగలేదు. గత ఏడాది ఊరేగింపు ముగిసిన తరువాత గుడి ప్రాంగణంలో టార్పాలిన్ కప్పి ఉంచి ఇక దాని గురించి పట్టించుకోలేదు. 

అంతర్వేది లో రథం అగ్నికి ఆహుతవడంతో... రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోని రథాల వద్ద నిఘా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడ నగర కమీషనర్ దుర్గ గుడి ఈఓతో చర్చించారు. ఇందుకు సంబంధించి రథాలకు షెడ్లు నిర్మించడం, సీసీటీవీల ఏర్పాటు వంటి ఇతర విషయాలను గురించి చర్చించారు. ఈ సమయంలో రథాల పరిశీలనకు వెళ్ళినప్పుడు వాటిపై కప్పి ఉంచిన కవర్ తొలిగించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

ఆలయ రథంలో ఉండవలిసిన నాలుగు సింహాల్లో ఒకటి మాత్రమే ఉంది. మిగిలిన మూడు సింహాలు మాయమైనట్టు అప్పుడు గుర్తించారు. వెండి సింహాలు మాయమైనట్టు గురైహించిన వెంటానే అధికారులు స్పందించకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులను ప్రశ్నించిన తరువాత, అది కూడా పరిశీలించి చెబుతామని చెప్పడంతో.... అధికారులపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

కనకదుర్గమ్మ గుడి దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఆయన అండదండలు ఉండబట్టే ప్రస్తుత ఈఓ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రథం పై వెండి సింహాలు మాయమైన విషయం గురించి చెప్పడానికి మూడు రోజుల గడువు ఎందుకని ఆలయ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. 

రథంపై సింహాలు మాయమైనట్టు గుర్తించిన వెంటనే అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, మాయమయ్యాయా అని ప్రశ్నిస్తే చెప్పడానికి మూడు రోజుల సమయం కోరడం అన్ని వెరసి దేవాలయ అధికారులపై మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి.   అమ్మవారి రథంపై ఉండాల్సిన వెండి సింహాలు మాయమవడంతో భక్తులు కలవర పడుతున్నారు.

click me!