కారణమిదీ: పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

By narsimha lodeFirst Published Oct 16, 2022, 1:31 PM IST
Highlights

జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  కు విశాఖ పోలీసులుఆదివారం నాడు నోటీసులు జారీచేశారు.అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని కోరారు.మరోవైపు ఇవాళ  సాయంత్రం 4  గంటలలోపుగావిశాఖనువదిలి వెళ్లాలని  కోరారు. 

విశాఖపట్టణం:: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన నేతలకు విశాఖపట్టణం  పోలీసులు ఆదివారం నాడు   నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా విశాఖపట్టణంలో కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు  ఆ నోటీసులో కోరారు.సెక్షన్ 30 యాక్షన్  అమల్లో ఉన్నందున  ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు  కోరారు.

పవన్ కళ్యాణ్ బస  చేసిన  హోటల్ లో  జనసేనానితో పోలీసుఅధికారులు ఆదివారం నాడు భేటీ అయ్యారు.  విశాఖలో ఉన్నఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని కూడా కోరారు.విశాఖలో జనవాణి, పార్టీనేతలతో సమావేశం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు.

. నిన్న  విశాఖలో నిర్వహించిన విశాఖగర్జనకు వస్తున్నమంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని  వైసీపీ ఆరోపించింది. అయితే  ఈ దాడితో తమకు సంబంధం  లేదని  జనసేన  ప్రకటించింది.  ఈ దాడితో  విశాఖపట్టణంలో  ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.   విశాఖలో పవన్ కళ్యాణ్   కార్యక్రమం నిర్వహిస్తే  శాంతి భద్రతల సమస్యలు  వచ్చే అవకాశం ఉందని  పోలీసులు భావిస్తున్నారు.  

ఇవాళ  ఉదయం నుండి పోలీసులు జనసేనాని  పవన్  కళ్యాణ్  తో చర్చిస్తున్నారు.పోర్టు స్టేడియం  వద్ద  నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని జనసేన వాయిదా వేసుకుంది. తమ  పార్టీ కార్యకర్తలను  పోలీసులు విడుదల  చేసిన తర్వాతే ఈ కార్యక్రమం  నిర్వహిస్తామని  పవన్ కళ్యాణ్  ప్రకటించారు.  అరెస్టైన జనసేన కార్యకర్తలను పరామర్శించాలని  పవన్ కళ్యాణ్   భావిస్తున్నారు.ఇప్పటికే మూడు  రాజధానులకు మద్దతుగా  జేఏసీ,వైసీపీ కార్యకర్తలు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ఈ  తరుణంలో   పవన్  కళ్యాణ్ బయటకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ  తరుణంలో   పవన్  కళ్యాణ్ బయటకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.  పోర్టు స్టేడియం వద్ద జనవాణి నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.అయితే  జనవాణి నిర్వహించే పోర్టు స్టేడియం వద్దకు వైసీపీ, జేఏసీ  క్యాడర్ ఆందోళనకు  దిగింది. జనసేన  కార్యకర్తలు కూడ  పోటీగా  ఆందోళనలు నిర్వహించారు. దీంతో  ఉద్రిక్తతలు నెలకొనడంతో  పోలీసులు  ఆందోళనకారులను పోలీసులు  అరెస్ట్  చేశారు.

అమరావతి నుండి అరసవెల్లి వరకు  ర్యాలీగా  అమరావతి రైతులు బయలుదేరారు. త్వరలోనే  విశాఖపట్టణం జిల్లాలోకి పాదయాత్ర రానుంది. ఈ  యాత్రకు  పోటీగా రాష్ట్రంలోని పలుచోట్ల రౌండ్  టేబుల్  సమావేశాలు,ర్యాలీలను వైసీపీ  నిర్వహిస్తుంది.మూడు రాజధానులను మద్దతుగా  ఇటీవలనే  జేఏసీ  ఏర్పాటైంది.  మూడురాజధానులకు మద్దతుగా  పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని జేఏసీ  భావిస్తుంది.

click me!