విశాఖను వదిలి వెళ్లాలని పవన్ కి పోలీసుల వినతి:నోవాటెల్ హోటల్ వద్ద భారీ బందోబస్తు

By narsimha lodeFirst Published Oct 16, 2022, 12:59 PM IST
Highlights

విశాఖలో ఉన్న జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ తో  పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విశాఖను వదిలి పోవాలని పోలీసులు కోరుతున్నారు.

విశాఖపట్టణం:విశాఖపట్టణంలో  ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్ననేపథ్యంలో విశాఖను వదిలివెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను పోలీసులు కోరారు. పవన్ కళ్యాణ్ బస చేసిన  నోవాటెల్  హోటల్  లో  ఈ  విషయమై పోలీసులు ఆయనతో చర్చిస్తున్నారు. విశాఖలో ఇవాళ నిర్వహించతలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని కూడ జనసేన వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

ఉత్తరాంధ్రకు చెందిన  పార్టీ నేతలతో  సమావేశంతో పాటు  జనవాణి  కార్యక్రమంలో  పాల్గొనేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్  నిన్న విశాఖపట్టణానికి వచ్చారు..నిన్న విశాఖపట్టణంలో మూడు  రాజధానులకు మద్దతుగా  జేఏసీ  ఆధ్వర్యంలో  విశాఖగర్జన నిర్వహించారు.విశాఖ గర్జనకు   వస్తున్న  మంత్రులు జోగి  రమేష్,రోజా కార్లపై జనసేన కార్యకర్తలు దాడి   చేశారని వైసీపీ  ఆరోపించింది.అయితే  ఈ దాడితో  తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది.

విశాఖ ఎయిర్  పోర్టు  నుండి  నోవాటెల్  హోటల్  కు పవన్ కళ్యాణ్   నిన్న ర్యాలీగా వచ్చే సమయంలో పోలీసులు  వ్యవహరించిన తీరును జనసేన తీవ్రంగా ఖండిచింది. పోలీసులకుసహకరించామని జనసేన నేతలు గుర్తు  చేశారు. అయితే  ఇవాళ  ఉదయం నుండి పోలీసులు జనసేన నేతలతో  చర్చిస్తున్నారు. విశాఖలోఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  విశాఖను వదిలి వెళ్లాలని  పవన్ కళ్యాణ్ ను పోలీసులు కోరుతున్నారు. ఈ విషయమై  పవన్ కళ్యాణ్  తో పోలీసు అధికారుల బృందం  చర్చిస్తుంది.

మరోవైపు  పవన్ కళ్యాణ్ బస చేసిన   నోవాటెల్  హోటల్  ముందు  పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు  చేశారు.విశాఖపట్టణంలోని పోర్టు వద్ద ఇవాళ నిర్వహించతలపెట్టిన జనవాణిని జనసేన వాయిదా వేసుకుంది. పోలీసులు  అరెస్ట్  చేసిన జనసేన కార్యకర్తలను విడుదల   చేసిన తర్వాతే జనవాణిని నిర్వహిస్తామని  పవన్ కళ్యాణ్  ప్రకటించారు. 

జనవాణి కార్యక్రమంలో  తమ సమస్యలు చెప్పుకొనేందుకు  ప్రజలు అక్కడికి  చేరుకున్నారు.కార్యక్రమం  వాయిదా పడిందని తెలుసుకొని జనం  అక్కడి నుండి వెళ్లిపోయారు.మరోవైపు జనవాణి కార్యక్రమం నిర్వహించే ప్రాంతానికి  జేఏసీ కార్యకర్తలు  చేరుకుని ఆందోళన నిర్వహించారు.మూడు రాజధానులకు అనుకూలమా,వ్యతిరేకమో పనవ్ కళ్యాణ్ స్పష్టం  చేయాలని ఆందోళన కారులు డిమాండ్   చేశారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో  పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

also read:అరెస్టైన కార్యకర్తలను విడుదలచేయాలి,విశాఖలో జనవాణి వాయిదా:పవన్ కళ్యాణ్

విశాఖలో ఉన్న  ఉద్రిక్త  పరిస్థితుల నేపథ్యంలో  పవన్ కళ్యాణ్ పర్యటన సాగిస్తే  పరిస్థితులు  చేజారే అవకాశంఉందని  పోలసులు అభిప్రాయపడుతున్నారు.  దీంతో  హోటల్ నుండి పవన్ కళ్యాణ్ ను బయటకు రానివ్వడం లేదు. అన్ని కార్యక్రమాలను రద్దు  చేసుకొని  విశాఖనువిడిచివెళ్లాలని పవన్ కళ్యాణ్  ను  పోలీసులు కోరుతున్నారు.
 

click me!