విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు.. స్కూల్ అటెండర్ అరెస్ట్..

Published : Jul 10, 2023, 01:17 PM IST
విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు.. స్కూల్ అటెండర్ అరెస్ట్..

సారాంశం

విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై 43 ఏళ్ల వ్యక్తి ‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు  అరెస్ట్ చేశారు.

విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై 43 ఏళ్ల వ్యక్తి ‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడిని ఓ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న కె సత్యారావుగా గుర్తించారు. బాధితురాలు అదే పాఠశాల విద్యార్థిగా ఉంది. ఇక,  ప్రస్తుతం ఈ కేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన సత్యారావును రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. బాలిక తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. 

విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలిక కుటుంబం నివాసంలో ఉంటుంది. నిందితుడు సత్యారావు కూడా అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడు బాలికను అపార్ట్‌మెంట్‌లోని టెర్రస్‌పైకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు చూపిస్తూ ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. అదే అదనుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకంలో అతని స్నేహితులను కూడా భాగస్వామ్యం  చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలతో బాలిక మానసికంగా కుంగిపోయింది. 

ఈ  నేపథ్యంలోనే అసలు విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు వైజాగ్‌లోని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో నిందితుడిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లలకు కఠినమైన రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం  బాధితురాకు విశాఖపట్నం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొందరు కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక పోలీసులకు తెలుపడటంతో.. పోలీసులు వారి కోసం కూడా గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతం దిశా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu