పవన్‌ను చూస్తేనే ఆడపిల్లలు భయపడుతున్నారు.. పేరును సార్దకం చేసుకున్నాడు: మంత్రి అమర్‌నాథ్

Published : Jul 10, 2023, 10:53 AM IST
 పవన్‌ను చూస్తేనే ఆడపిల్లలు భయపడుతున్నారు.. పేరును సార్దకం చేసుకున్నాడు: మంత్రి అమర్‌నాథ్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. నిత్యం వైసీపీ  ప్రభుత్వంపై నిందలు వేయడమే పవన్ పనా? అని ప్రశ్నించారు. పవన్ ఇలానే మాట్లాడితే ప్రజలే చెప్పులు చూపిస్తారని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. నిత్యం వైసీపీ  ప్రభుత్వంపై నిందలు వేయడమే పవన్ పనా? అని ప్రశ్నించారు. పవన్ ఇలానే మాట్లాడితే ప్రజలే చెప్పులు చూపిస్తారని అన్నారు. పవన్ కల్యాణ్ కాకి లెక్కలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. పవన్ కల్యాణ్ సైకోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని అన్నారు. వాలంటీర్లపై  పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు బాధకరమని అన్నారు. వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని  చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నారని అన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ను  చూస్తేనే ఆడపిల్లలకు భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘‘వాలంటీర్లు.. ఇంటింటికి వెళ్లి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, వితంతులు ఉన్నారు.. వారి బ్యాగ్రౌండ్‌ ఏమిటనేది చూస్తున్నారని పవన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు ఉన్న ఆలోచనలు వాలంటీర్ల మీద రుద్దేస్తే ఎలా?. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు భయపడాలంటే పవన్‌ కల్యాణ్‌కే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కడతావోనని భయపడి తిరుగుతున్నారు. కల్యాణ్ అని  ఆయనకు ఏ సందర్భంలో పేరుపెట్టారో గానీ.. ఆ పేరును  సార్దకం చేసుకున్నాడు. పవన్ చూస్తేనే భయపడాలి గానీ.. వాలంటీర్లను చూసి ఎవరూ భయపడటం లేదు’’ అని అమర్‌నాథ్ అన్నారు. 

జగన్‌కు పవన్ ఎప్పుడూ గౌరవం ఇచ్చారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఆయనకు ప్యాకేజ్‌ ఇచ్చే చంద్రబాబు నాయుడుకు మాత్రమే గౌరవం ఇస్తారని.. మరెవరికి ఇవ్వరని అన్నారు.  పవన్ కల్యాణ్ తల్లిని, భార్యను వైసీపీ ఎప్పుడూ ఏం అనలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని సపోర్టు చేసే యూట్యూబ్ చానల్స్, మీడియా సంస్థలు.. పవన్ తల్లిని అవమానించారని ఆరోపించారు. వాళ్లకే పవన్ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. సినిమాల్లో ఉన్న కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిసులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారని.. మరి పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేదని ప్రశ్నించారు.  పవన్‌ను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. 


పవన్ కల్యాణ్ మాటలను వైసీపీ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కల్యాణ్ మాటలు ఆయన  కిరాయి  కార్యకర్తలకు, సైకో ఫ్యాన్స్‌కు మాత్రమే రుచిస్తాయని విమర్శించారు. పవన్ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని.. రాజకీయ లబ్ది కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆలోచనలు, సిద్దాంతాలు కూడా లేనిది పవన్ పార్టీ అని విమర్శించారు. పవన్ నిత్య పెళ్లి కొడుకు అంటూ విమర్శలు గుప్పించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే