విశాఖపట్టణం టీనేజర్ రీతీ సాహా కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో విశాఖ పట్టణం ఫోర్త్ టౌన్ సీఐను వీఆర్ కు సరెండర్ చేశారు సీపీ.
విశాఖపట్టణం: నగరంలోని టీనేజర్ రీతీసాహా మృతి కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న విశాఖపట్టణం ఫోర్త్ టౌన్ సీఐ శ్రీనివాసరావును వీఆర్‌కు సరెండర్ చేశారు సీపీ త్రివిక్రమ్ వర్మ. రీతీసాహా పేరేంట్స్ ఈ కేసు విచారణపై సంతృప్తిగా లేరు. దీంతో మృతురాలి పేరేంట్స్ కోర్టును కూడ ఆశ్రయించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రీతీసాహా ఈ ఏడాది జూలై 14వ తేదీన రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణంలోని నరసింహనగర్ లో గల సాధనా హస్టల్ లో రీతీసాహా ఉంటుంది. విశాఖలోని ఓ విద్యాసంస్థలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ విద్యా సంస్థకు అనుబంధంగా ఉన్న హస్టల్ లోనే ఆమె ఉంటుంది. అయితే గత నెల 14న హస్టల్ నాలుగో అంతస్థు నుండి కిందపడి ఆమె మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న పేరేంట్స్ విశాఖపట్టణానికి చేరుకున్నారు
undefined
. హస్టల్ సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అయితే నాలుగో అంతస్తు పైకి వెళ్లే సమయంలో ఒక్క డ్రెస్, నాలుగో అంతస్తు నుండి కిందకు పడే సమయంలో మరో డ్రెస్ వేసుకున్నట్టుగా సీసీటీవీ పుటేజీలో ఉందని మృతురాలి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. మరో వైపు సీసీటీవీ పుటేజీలో చూపిస్తున్న సమయంలో కూడ తేడాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయమై పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వారు ఆరోపణలు చేస్తున్నారు.
దీంతో బాధిత కుటుంబం బెంగాల్ సీఎం మమత బెనర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. బెంగాల్ సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బెంగాల్ నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని మమత బెనర్జీ ఆదేశించారు. బెంగాల్ పోలీసులు కూడ విశాఖకు చేరుకొని ఈ కేసు గురించి ఆరా తీశారు.
ఈ కేసుకు సంబంధించి విశాఖపట్టణం పోలీసులపై రీతీ సాహా పేరేంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై బాధిత కుటుంబం కోర్టును కూడ ఆశ్రయించారు. రీతీ సాహాను అనుమానాస్పద మృతి కాదని హత్యగా వారు ఆరోపణలు చేస్తున్నారు.