విశాఖ స్టీల్ ప్లాంట్: యాజమాన్యంతో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ భేటీ

By narsimha lode  |  First Published Apr 13, 2023, 5:19 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్  పూర్తి స్థాయి సామర్ధ్యంతో  నడిపించేందుకు తీసుకోవాల్సిన  చర్యలపై  కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్  చర్చిస్తున్నారు. 


విశాఖపట్టణం: విశాఖస్టీల్ ప్లాంట్  యాజమాన్యంతో  గురువారంనాడు  కేంద్ర ఉఖ్కు  శాఖ మంత్రి  ఫగ్గన్ సింగ్  సమావేశమయ్యారు.   విశాఖ స్టీల్ ప్లాంట్  మూలధనాన్ని  సమకూర్చుకొనేందుకు గాను  ఈఓఐని ఆహ్వానించింది  ఆర్ఐఎన్ఎల్.  ఈ నెల  15వ  తేదీతో  బిడ్డింగ్ లో  పాల్గొనేందుకు  చివరి రోజు. ఇవాళ  కేంద్ర  మంత్రి  ఫగ్గన్ సింగ్  విశాఖపట్టణానికి  చేరుకున్నారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణపై  ముందుకు  వెళ్లడం లేదని ఫగ్గన్ సింగ్  ఇవాళ స్పష్టం  చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్  పూర్తిస్థాయిలో  పనిచేసేలా  ప్రయత్నాలు  ప్రారంభించామని  మంత్రి  చెప్పారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  ను పూర్తి సామర్ధయంతో  నడిచేందుకు  తీసుకోవాల్సిన  చర్యలపై   కేంద్ర మంత్రి  స్లీల్ ప్లాంట్  యాజమాన్యంతో  చర్చించారు.   కార్మిక సంఘాలతో  కూడా  కేంద్ర మంత్రి సమావేశం  కానున్నారు.

Latest Videos

undefined

also read:విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకెళ్లలేం: కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు


 స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించవద్దని  కార్మిక సంఘాలు  జేఏసీగా  ఏర్పడి పోరాటం  చేస్తున్నాయి. ప్రైవేటీకరణను  కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్ కు  అవసరమైన  ముడి సరుకును అందిస్తే  లాభాల్లో  నడుస్తుందని కార్మిక సంఘాల నేతలు  చెబుతున్నారు . 

విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను ఏపీ రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.   స్టీల్  ప్లాంట్  ను  లాభాల్లోకి  ఎలా  వస్తుందో  తాము చెబుతామని  కార్మిక సంఘాల జేఏసీ నేతలు  ప్రకటించారు.  ప్రధానితో  సమావేశం ఏర్పాటు చేయిస్తే  ఈ విషయాలను  వివరిస్తామని కూడా  కార్మిక సంఘాల  జేఏసీ నేతలు  గతంలో  ప్రకటించిన విషయం తెలిసిందే. 

రెండేళ్ల క్రితం  విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  నష్టాల్లో  ఉందని  విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించాలని  నిర్ణయం తీసుకున్నామని  కేంద్రం ప్రకటించింది . ఇటీవల  పార్లమెంట్  ఎంపీలు  అడిగిన  ప్రశ్నలకు  కూడా  ప్రైవేటీకరణ  విషయంలో  వెనక్కు తగ్గమని  కేంద్రం ప్రకటించింది.  కానీ  ఇవాళ  ఈ విషయమై  కేంద్రం వెనక్కు తగ్గినట్టు ప్రకటించింది.

click me!