మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు కీలక వాదనలు విన్పించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ, వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదుల మధ్య కీలక వాదనలు జరిగాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడుగా ఉన్న దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతుందని భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా ఈ కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను విచారించడం సరైంది కాదని భాస్కర్ రెడ్డి న్యాయవాది వాదించారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది వాదలను సీబీఐ తరపు న్యాయవాది తోసిపుచ్చారు.
undefined
వైవఎస్ వివేకానందరెడ్డి హత్య లో రూ. 40 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. దీని వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని వివేకానందరెడ్డి చెప్పారు. గూగుల్ టేకవుట్ ఫోటోలతో నిందితులను పట్టుకుంటామని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇప్పుడు తప్పుపట్టడం సరైంది కాదని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధింపులకు గురి చేసినందును సునీల్ యాదవ్ హత్య చేసినట్టుగా ఈ పిటిషన్ లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
also read:తల్లికి లైంగిక వేధింపులు.. అందుకే వివేకాను సునీల్ యాదవ్ చంపాడు : భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలనం
2019 మార్చి 14న తన నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. ఈ కేసులో కొందరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ చేస్తుంంది.ఇటీవల కాలంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను సీబీఐ అధికారులు వరుసగా విచారిస్తున్నారు . ఈ కేసులో సీబీఐ అధికారుల విచారణను కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుబట్టారు.