
నోట్ల విషయంలో ఇంతవరకు ప్రజలు నిగ్రహం పాటించారు.
తమ కోపాన్ని పెద్దగా ఎక్కడ చూపకుండా క్యూలలో నిలబడి, తమ వంతు వచ్చాక బ్యాంకు వాళ్లు ఇచ్చే రెండు వేలు కళ్లకద్దుకుని వెళ్లిపోతూ వచ్చారు.
తీరా తమ వంతు వస్తూనే బ్యాంకు కౌంటర్ మూసేసినా, ఎటిఎంలో డబ్బుఅయిన పోయినా దురదృష్టం అనుకుని వెళ్లిపోతూ వచ్చారు.
ఇపుడు అక్కడ డక్కడ దేశం లో దాడులు జరుగుతున్నట్లు వార్తలందుతున్నారు. బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది పలుకుబడి ఉన్నవారికి కొత్త నోట్లు తరలిస్తున్నట్లు వార్తలు వెలువడుతూ ఉండటంలో బ్యాంకు సిబ్బంది మీద అను మానాలు పెరుగుతున్నాయి.
ఇలా అనుమానం వచ్చిన ప్యాపిలి ప్రజలు బ్యాంకుసిబ్బందిని నిర్బంధించి తమకు డబ్బు లివ్వాల్సిందే నని పట్టుబట్టారు. హైదరబాద్ –బెంగుళూరు హైవేమీద కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఉంటుంది.
గత నెల రోజులలో కేవలం అరురోజుల మాత్రమే కొంతమందికి బ్యాంకు సిబ్బంది కొత్తనోట్లు ఇచ్చారని వారు చెబుతున్నారు. బ్యాంకుకు వచ్చిన నోట్లను బ్యాంకు అధికారులు తమకు తెలిసిన వారి సర్దుతున్నారని ప్రజల అనుమానం.