మళ్ళీ ఏపిని మోసం చేసిన కేంద్రం

Published : Dec 15, 2016, 05:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మళ్ళీ ఏపిని మోసం చేసిన కేంద్రం

సారాంశం

ప్యాకేజికి ఎప్పుడో చట్టబద్దత కల్పిస్తే మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి ప్యాకేజికి చట్టబద్దత కల్పిస్తామంటూ ఇంతకాలమూ ఎందుకు చెప్పినట్లు?

ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం దారుణంగా మోసం చేసింది. ప్రత్యేకప్యాకేజి, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రాయితీ తదితరాల విషయంలో దెబ్బకొట్టింది. ఇంతకాలమూ ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కల్పిస్తామంటూ ఊరించిన కేంద్రం మాట మార్చటం గమనార్హం.

 

ప్యాకేజికి ఎప్పుడో చట్టబద్దత కల్పించినట్లు తాజాగా చెప్పింది. ప్యాకేజికి ఎప్పుడో చట్టబద్దత కల్పిస్తే మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి ప్యాకేజికి చట్టబద్దత కల్పిస్తామంటూ ఇంతకాలమూ ఎందుకు చెప్పినట్లు? చట్టబద్దతపై ఎన్నిమార్లు ప్రశ్నించినా జైట్లీ ఎందుకు మౌనం వహించినట్లో?

 

అలాగే, ఇతర రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర విభజన చట్టం, 14వ ఆర్ధిక సంఘం ఏపికి ఇచ్చిన అన్నీ హామీలను ఎప్పుడో అమలు చేసేసామని చెప్పటం రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించటమే. ఘనత వహించిన నిప్పు చంద్రబాబునాయడు ముఖ్యమంత్రిగా చోద్యం చూస్తున్నపుడు కేంద్రం మత్రం ఎందుకు లెక్క చేస్తుంది.

 

ప్రతిపక్ష సభ్యుడు అవినాష్ రెడ్ది అడిగిన ఓ ప్రశ్నకు ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సమాధానమిస్తూ ‘ఏపికి కేంద్రం బాకీ ఏమీ లేద’ని పార్లమెంట్ లోనే స్పష్టంగా ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజిని అరుణ్ జైట్లీ ప్రకటించినపుడే చట్టబద్దత వచ్చేసినట్లుగా ఇంద్రజిత్ సింగ్ చెప్పటం నిజంగా రాష్ట్రప్రభుత్వానికి సిగ్గు చేటు.

 

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల జాబితాను  ఏపి ప్రభుత్వం అందచేయకపోవటం వల్లే రాయితీలు ఇవ్వలేకపోయినట్లు కూడా మంత్రి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కేంద్రంమంత్రి ప్రకటించినపుడు టిడిపి మంత్రులు, ఎంపిలు కూడా సభలోనే ఉండటం గమనార్హం.

 

ప్యాకేజికి చట్టబద్దత విషయంలో ఇంతకాలం కథలు చెప్పిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, సిఎం చంద్రబాబునాయడు ఇపుడు ఏమి చెబుతారో?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?