ఏపీకి మూడు రాజధానులు: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత,మీడియాపై దాడి

By narsimha lode  |  First Published Dec 27, 2019, 11:42 AM IST

ఏపీకి మూడు రాజధానులు వద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఉద్డండరాయునిపాలెం వద్ద మీడియాపై స్థానికులు దాడికి దిగారు. 


అమరావతి: అమరావతికి సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మీడియాపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. కారు ధ్వంసమైంది. కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

అమరావతి నుండి రాజధానిని మార్చవద్దని  కోరుతూ 10 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. 

Latest Videos

undefined

అమరావతి నుండి రాజధానిని మార్చవద్దని  కోరుతూ 10 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు.  శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశంలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ఈ తరుణంలో ఉద్దండరాయునిపాలెం నుండి సచివాలయం వైపుకు వెళ్లే మీడియా ప్రతినిధుల వాహనంపై స్థానికులు దాడికి దిగారు.

సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రధాన దారిలో ఈ ఘటన చోటు చేుసుకొంది. మీడియా వాహనాన్ని అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు కూడ గాయాలయ్యాయి.

ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మీడియా వాహనం డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కు నడిపాడు. అయితే వెనుకే వస్తున్న వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్: రాజధానిపై కీలక నిర్ణయం

కారులో ఉన్న మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. దీంతో  ఇతర మీడియా ప్రతినిదులు వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమక్షంలోనే మీడియా ప్రతినిధులపై స్థానికులు దాడికి దిగారు.

Also read:నేడే ఏపీ కేబినెట్ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం, టెన్షన్ వాతావరణం

ఇతర మీడియా ప్రతినిధులు కూడ ఈ దాడిని నివారించే ప్రయత్నించే చేశారు.ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు కూడ మీడియా ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

also read:బొత్స ఇల్లు ముట్టడి, ప్రకాశం బ్యారేజీపై రాకపోకల నిలిపివేత: కొనసాగుతున్న ఉద్రిక్తత

జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చిన రోజున కూడ అమరావతి పరిసర గ్రామాల్లో కూడ  ఇదే రకంగా మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. బాధితుల నుండి పోలీసులు ఫిర్యాదులను స్వీకరించనున్నారు.

click me!