బొత్స ఇల్లు ముట్టడి, ప్రకాశం బ్యారేజీపై రాకపోకల నిలిపివేత: కొనసాగుతున్న ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Dec 27, 2019, 10:57 AM IST

ఏపీ కేబినెట్ సమావేశాన్ని పురస్కరించుకొని అమరావతి పరిసర గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని పురస్కరించుకొని  అమరావతి పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలను ఉధృతం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు శుక్రవారం నాడు ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు 10 రోజులుగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం నాడు ఉదయం టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Latest Videos

విజయవాడ పోలీస్ కంట్రోల్‌రూమ్ నుండి ఏపీ సచివాలయం వరకు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను పోలీసులు నిషేధించారు. 

సచివాలయం వైపు వెళ్లే ప్రధాన రహదారులపై పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు.

సీఎం జగన్  ఏపీ సచివాలయానికి వెళ్లే సమయంలో  పోలీసులు మరింత అలర్ట్‌గా ఉంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులను గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే  ఆయా వాహానాలను అనుమతి ఇస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులను కూడ బస్సులను సచివాలయం వైపు వెళ్లకుండా పోలీసులు నిలిపివేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే రహదారులపై వెళ్లే ప్రతి ఒక్కరిని కూడ గుర్తింపు కార్డులను ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. 

అనుమానిత వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అమరావతి పరిసర గ్రామాలకు వెళ్లే వారిని ఆధార్ కార్డు లేదా  సరైన గుర్తింపు కార్డులను చూపితేనే అనుమతిస్తున్నారు.


 

click me!