ప్రారంభమైన ఏపీ కేబినెట్: రాజధానిపై కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Dec 27, 2019, 11:25 AM IST
Highlights

అమరావతి నుండి రాజధానిని మార్చవద్దని కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు  సచివాలయంలో ప్రారంభమైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైంది.ఏపీకి మూడు రాజధానుల అంశంపై  కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. రాజదానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికపై కూడ ప్రభుత్వం చర్చించనుంది.

Also read:నేడే ఏపీ కేబినెట్ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం, టెన్షన్ వాతావరణం

ఏపీ రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. ఇటీవలనే జీఎన్ రావు కమిటీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరో వైపు రాజధాని అభివృద్ధిపై బోస్టన్ కమిటీ  ఇప్పటికే మధ్యంతర నివేదికను ఇచ్చింది.ఈ నివేదికపై కూడ కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

మరో వైపు బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ తుది నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. బ్రౌన్‌ఫీల్డ్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేయాలని  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ మధ్యంతర కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.

also read:బొత్స ఇల్లు ముట్టడి, ప్రకాశం బ్యారేజీపై రాకపోకల నిలిపివేత: కొనసాగుతున్న ఉద్రిక్తత

మరో వైపు రాజధానిని అమరావతిని తరలించే విషయమై ఏపీ రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమరావతిలో రాజధాని భూముల కోసం తీసుకొన్న భూమిని రైతులకు తిరిగి ఇచ్చే విషయమై కూడ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అయితే రైతులను  ఏ రకంగా ప్రభుత్వం సంతృప్తిపర్చనుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే విషయమై మొగ్గు చూపే అవకాశం కన్పిస్తోంది.  

ఏపీ రాజధానిని మార్చవద్దని కోరుతూ  అమరావతి పరిసర గ్రామాల రైతులు, స్థానికులు 10 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. గొల్లపూడి సెంటర్‌లో రాజధానిని మార్చొద్దని కోరుతూ జాతీయ రహాదారిపై రైతులు బైఠాయించారు.రైతులతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడ బైఠాయించారు.

click me!