విజయవాడలో కనిపించకుండా పోయిన హౌస్ సర్జన్ అమూల్య ఆచూకీ లభ్యం..!

Published : Dec 21, 2022, 05:22 PM IST
విజయవాడలో కనిపించకుండా పోయిన హౌస్ సర్జన్ అమూల్య ఆచూకీ లభ్యం..!

సారాంశం

విజయవాడలోని సిదార్థ మెడికల్‌లో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న యువతి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఉంటున్న హాస్టల్ రూమ్‌లో సూసైడ్ ‌నోట్ లభించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. 

విజయవాడలోని సిదార్థ మెడికల్‌లో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న యువతి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఉంటున్న హాస్టల్ రూమ్‌లో సూసైడ్ ‌నోట్ లభించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. తెలంగాణలోని జహీరాబాద్‌కు చెందిన అమూల్య విజయవాడలోని  సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో హౌస్ సర్జన్‌గా చేస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ నోట్‌ను హాస్టల్ గదిలో ఉంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సిద్ధార్థ వైద్య కళాశాల సిబ్బంది మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ విజయవాడ సెంట్రల్ ఏసీపీకి కూడా సమాచారం అందించారు. 

ఈ క్రమంలోనే అమూల్య ఆచూకీ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సంగంజాగర్లమూడిలో అమూల్య ఆచూకీని పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు అమూల్యను విజయవాడకు తీసుకువస్తున్నారు. అయితే పని ఒత్తిడే కారణంగానే అమూల్య ఈ విధంగా చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు