బెస్ట్ సోలే మేట్.. కూలెస్ట్ ఫ్రెండ్: భార్యకు స్వీట్‌గా నారా లోకేష్ బర్త్ డే విషెస్

By Sumanth Kanukula  |  First Published Dec 21, 2022, 4:26 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు (డిసెంబర్ 21) బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ ట్విట్టర్‌‌లో ఓ పోస్ట్ చేశారు. బ్రాహ్మణి తన బెస్ట్ సోల్ మేట్ అని పేర్కొన్న లోకేష్.. తనను హృదయపూర్వకంగా ప్రేమిస్తూనే ఉంటానని  చెప్పారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి. నువ్వు నా కూలెస్ట్ ఫ్రెండ్‌వి. నేను కోరుకున్న, కలలుకన్న.. బెస్ట్‌ సోల్ మేట్‌. హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. ఇక, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

ఇక, నారా లోకేష్‌, బ్రాహ్మణిలు 2007లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి కుమారుడు దేవాన్షు ఉన్నారు. దేవాన్షు 2015లో జన్మించారు. లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉంటే.. బ్రాహ్మణి మాత్రం కుటుంబానికి సంబంధించి వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. తన అత్త భువనేశ్వరి తోడుగా కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బ్రాహ్మణి లోకేష్ తరపున మంగళగిరిలో ప్రచారం కూడా చేశారు. అయితే బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి రావాలని, పోటీ చేయాలని డిమాండ్ చేసేవారు కూడా ఉన్నారు. 

Latest Videos

 

. You are the coolest friend I could ever have and the best soul mate I could ever dream of. Love you from the bottom of my heart ❤️

— Lokesh Nara (@naralokesh)
click me!