
ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగి 16 మంది మరణించిన కేసులో హైదరాబాదు లింక్స్ బయటపడ్డాయి. కురిచేడులో శానిటైజర్లు తాగి 16 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. శానిటైజర్ల తయారీకి ముడి పదార్థాలు హైదరాబాదు నుంచి సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాదులోని జీడిమెట్లలో గల ఫర్ ఫెక్ట్ సొల్యూషన్స్ నుంచి ఆ ముడిపదార్థాలు సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థకు చెందిన అమీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముడిపదార్థాలను అమిర్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తో పాటుపది మందిని అరెస్టు చేశారు.
Also Read: చదివింది మూడే, శానిటైజర్ తయారీ: కురిచేడులో 16 మంది మృతికి కారణమయ్యాడు
యూట్యూబ్ లో చూసి శానిటైజర్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మిథైల్ క్లోరోఫైడ్ కారణంగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మిథైల్ క్లోరోఫైడ్ ఎవరు సరఫరా చేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ర్ ఫెక్ట్ బ్రాండ్ పేరుతో శానిటైజర్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
కురిచేడులో శానిటైజర్లు తాగి మరణాలు సంభవించిన ఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. పర్ ఫెక్ట్ దుకాణాన్ని శ్రీనివాస రావు అనే వ్యక్తి నడుపుతున్నాడు.
Also Read: కురిచేడు,పామూరులో మరణాలు జగన్‌రెడ్డి సర్కారు హత్యలే:నారా లోకేష్