జాగ్రత్త... రోడ్డుపై చెత్తవేసారో ఇలా కోర్టు మెట్లెక్కాల్సిందే.. : విజయవాడ కమీషనర్ హెచ్చరిక 

Published : Nov 07, 2023, 02:55 PM ISTUpdated : Nov 07, 2023, 02:56 PM IST
జాగ్రత్త... రోడ్డుపై చెత్తవేసారో ఇలా కోర్టు మెట్లెక్కాల్సిందే.. : విజయవాడ కమీషనర్ హెచ్చరిక 

సారాంశం

విజయవాడను పరిశుభ్రంగా వుంచేందుకు మున్సిపల్ కార్పోరేషన్  అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని కమీషనర్ హెచ్చరించారు. 

విజయవాడ : మన ఇళ్లు, పరిసరాలనే కాదు నిత్యం ఉపయోగించే రోడ్లను కూడా పరిశుభ్రంగా వుంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంటుందని విజయవాడ కార్పోరేషన్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. రోడ్లపై చెత్తాచెదారం వేసినవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నామని... కార్పోరేషన్ కోర్టులో హాజరుపర్చి జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. 

ఇలా కార్పోరేషన్ నిబంధనలు ఉళ్లంఘించినవారిని ఇవాళ న్యాయమూర్తి విజయ్ కుమార్ రెడ్డి ముందు హాజరుపర్చారు అధికారులు. 14 కేసులపై విచారణ జరిపిన న్యాయమూర్తి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారికి జరిమానా విధించారు. ఇప్పటికి జరిమానాతో వదిలిపెడుతున్నామని... మరోసారి ఇలాగే నిబంధనలు ఉళ్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి హెచ్చరించారు. 

Read More  విజయవాడ బస్ యాక్సిడెంట్ కు కారణమదే... ఆర్టిసి ఎండీ చేతికి నివేదిక

రోడ్లపై చెత్తవేసినా, మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకున్నా, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నా చర్యలు తప్పవని 
కమీషనర్ స్వప్నిల్ హెచ్చరించారు. ఇలాంటి వారిని అధికారులు పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తారని... న్యాయమూర్తి వారిపై చర్యలు తీసుకుంటారని కమీషనర్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం